Toll Plaza New Rules : వాహనదారులకు బిగ్ బ్రేకింగ్.. టోల్ ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ బంద్.. యూపీఐ చేస్తే భారీ పెనాల్టీ..!
Toll Plazas New Rules : టోల్ గేట్ల వద్ద లాంగ్ క్యూలు ఉండవు. ఫాస్టాగ్ ఉపయోగించకపోవడం లేదా యూపీఐ పేమెంట్లను ఎంచుకునే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవు.
- Sreehari A
- Published On : April 9, 2026 / 05:57 PM IST
Toll Plazas New Rules
- హైవేలపై ప్రయాణించే వాహనాదారులకు అలర్ట్
- టోల్ ప్లాజా వద్ద లాంగ్ క్యూలతో ఇబ్బంది ఉండదు
- ఏప్రిల్ 10 నుంచి క్యాష్ పేమెంట్లు చేయలేరు
- యూపీఐ పేమెంట్లపై 1.25 రెట్లు చెల్లించాలి
Toll Plazas New Rules : నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
టోల్ బూత్‌ల వద్ద లాంగ్ క్యూలను నివారించేందుకు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ (Toll Plaza New Rules) మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వ కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే మీరు తప్పించుకోలేరు. పైగా భారీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
యూపీఐ ద్వారా పేమెంట్లపై భారీ నష్టం :
ఏప్రిల్ 10వ తేదీ తర్వాత టోల్ బూత్‌ల వద్ద క్యాష్ పేమెంట్లను స్వీకరించబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, వ్యాలిడిటీ ఉన్న ఫాస్టాగ్ లేని వాహనాలకు యూపీఐ ద్వారా పేమెంట్ చేసేందుకు అవకాశం కల్పించారు.
అయినప్పటికీ, మీరు ఫాస్టాగ్ బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే.. సాధారణ టోల్ రేటుకు 1.25 రెట్లు, అంటే 25శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ టోల్ ఫీజు రూ. 100 అయితే, మీ వద్ద ఫాస్టాగ్ లేకపోతే యూపీఐ ద్వారా రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
టోల్ గేట్ల వద్ద ఉండే లాంగ్ క్యూలను నివారించడమే లక్ష్యమని NHAI సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టోల్ వసూలుకు ఫాస్టాగ్ ప్రైమరీ మెథడ్‌గా కొనసాగుతుంది. ఒకవేళ డ్రైవర్ ఫాస్టాగ్ వాడకపోయినా లేదా యూపీఐ ద్వారా పేమెంట్లను ఎంచుకున్నా నిబంధనల ప్రకారం ఆ వాహనంపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు ఫుల్ డిమాండ్ :
టోల్ పేమెంట్ల ఈజీ చేసేందుకు NHAI ‘వార్షిక పాస్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై వాహనాదారుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వార్షిక పాస్ చందాదారుల సంఖ్య 5 మిలియన్లను దాటింది. ఈ పాస్ వాహనాదారులు రూ. 3,075 రుసుముతో ఏడాదికి 200 సార్లు టోల్ దాటవచ్చు. గత ఏడాదిలో ఆగస్టు 15న ప్రారంభం నుంచి ఈ పాస్‌లు 265.5 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై 1,150కిపైగా టోల్ ప్లాజాలు పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి వాటన్నింటిపై కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. భవిష్యత్తులో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా పేమెంట్ పూర్తిగా ఆటోమేటిక్ కానుంది.
