EPF withdrawal
EPF withdrawal : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ నుంచి ఇకపై డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే.. అతి త్వరలో కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఈపీఎఫ్ఓ దీనికి సంబంధించి కొత్త వ్యవస్థను ప్రస్తుతం పరీక్షిస్తోంది.
ఏప్రిల్ 2026 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్లు, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా ద్వారా ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ ఈజీగా యాక్సస్ చేయొచ్చు. దాంతో పీఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా అలాగే ఏటీఎం ద్వారా కూడా డ్రా చేసుకోవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే పీఎఫ్ విత్ డ్రా క్లెయిమ్ ప్రాసెస్ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు అనమాట. అందిని సమాచారం ప్రకారం.. ఈపీఎఫ్ఓ ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ అప్ గ్రేడ్ చేస్తోంది.
అయితే, దశల వారీగా ఈ సర్వీసును అమల్లోకి తీసుకొచ్చేందుకు బ్యాంకులు, యూపీఐ ప్లాట్ ఫారాలతో చర్చలు జరుపుతోంది. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే.. పీఎఫ్ విత్ డ్రా అనేది ప్రస్తుతం 7 రోజుల నుంచి 15 రోజుల సమయం నుంచి ఇన్ స్టంట్ క్రెడిట్ లేదా గరిష్టంగా 24 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు క్రెడిట్ అవుతాయి.
యూపీఐ, ఏటీఎంతో ఎందుకు లింకింగ్ అంటే? :
పీఎఫ్ డబ్బుల విత్ డ్రా ప్రకియను వేగవంతం చేసేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ యూపీఐ, ఏటీఎం విత్ డ్రాలను ప్రోత్సహిస్తోంది. ఆన్ లైన్ క్లెయిమ్ విషయంలో ప్రాసెస్ అప్రూవల్ కోసం ఎక్కువ సమయం పడుతోంది. ఇకపై అలా కాకుండా అత్యవసర సమయాల్లో డబ్బులు పొందేలా ఈపీఎఫ్ఓ ఈ దిశగా చర్యలు చేపడుతోంది.
కొత్త ఈపీఎఫ్ విత్‌డ్రా బెనిఫిట్స్ ఏంటి? :
ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను మోడ్రాన్ డిజిటల్ పేమెంట్ నెట్‌వర్క్‌లతో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటోంది. దాంతో చిన్న మొత్తంలో విత్ డ్రాకు సుదీర్ఘమైన క్లెయిమ్ దాఖలు అవసరం ఉండదు. తద్వారా ఆమోదం ఆలస్యం ఉండదు. యూపీఐ ద్వారా డబ్బును తక్షణమే ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. నిర్ణీత పరిమితుల్లోపు ఏటీఎం ద్వారా క్యాష్ విత్ డ్రా చేయొచ్చు.
పేపర్ వర్క్ ఉండదు. ఎక్కువ సమయం ఎదురుచూడాల్సిన పనిలేదు. బ్యాంకు అకౌంట్లలోకి పీఎఫ్ డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. UANతో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్ వెరిఫై అవుతుంది. మీరు యాప్‌లో విత్ డ్రా రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది.
ఆధార్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ చెక్ ద్వారా కన్ఫార్మ్ చేస్తారు. డబ్బు యూపీఐ ద్వారా మీ బ్యాంకు అకౌంటులో నేరుగా డబ్బు జమ అవుతుంది. మెడికల్ బిల్స్, వివాహాలు, లేదా గృహ నిర్మాణం వంటి వాటి పాక్షికంగా డబ్బులను డ్రా చేసుకోవచ్చు.
ATM నుంచి పీఎఫ్ డబ్బుల ఉపసంహరణ :
ఈపీఎఫ్ఓ ఏటీఎంల నుంచి కూడా పీఎఫ్ డబ్బులను డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. డెబిట్ కార్డు మాదిరి పీఎఫ్ కార్డును ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఖాతాదారులు నిర్ణీత పరిమితి వరకు మాత్రమే డబ్బులను డ్రా చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం పీఎఫ్ విత్ డ్రాకు సాధారణంగా 7 రోజుల నుంచి 15 వర్కింగ్ డేస్ మాత్రమే పడుతోంది.
NEFT లేదా RTGS ద్వారా ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఎలాంటి క్యాష్ విత్ డ్రా అనుమతి లేదు. ప్రతిపాదిత వ్యవస్థ ద్వారా యూపీఐ ద్వారా అదే రోజు లేదా వెంటనే డబ్బును పొందవచ్చు. ఏటీఎం విత్ డ్రా కూడా సాధ్యమవుతాయి. యాప్‌లో సింగిల్ ట్యాప్‌తో క్లెయిమ్‌లు చేయవచ్చు. అడ్వాన్స్ విత్ డ్రా ఆటో-మోడ్‌కి మారిపోతాయి.