Nokia 5710 XpressAudio: ఫీచర్ ఫోన్లోనే 4జీ, ఇన్‌బిల్ట్ ఇయర్‌బడ్స్.. సరికొత్త కాన్సెప్ట్‌తో మార్కెట్లోకొచ్చిన నోకియా ఫోన్
కొంత కాలంగా కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయని నోకియా సంస్థ తాజాగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఫీచర్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 4జీని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులోనే ఇన్‌బిల్ట్ ఇయర్‌బడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌తోనే వాటిని ఛార్జింగ్ చేసుకోవచ్చు.
- Narender Thiru
- Published On : September 16, 2022 / 08:24 PM IST
Nokia 5710 XpressAudio: హెచ్ఎమ్‌డీ సంస్థ సరికొత్త కాన్సెప్ట్‌తో నోకియా ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఫోన్లోనే ఇన్‌బిల్ట్ ఇయర్‌బడ్స్ ఉండటం ఈ ఫీచర్ ఫోన్ ప్రత్యేకత. అలాగే 4జీ నెట్‌వర్క్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్
‘నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ఆడియో’ పేరుతో ఈ ఫోన్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్లోకి విడుదలైంది. చూడ్డానికి సాధారణ ఫీచర్ ఫోన్లాగే కనిపించినప్పటికీ, డిజైన్ చాలా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఫోన్ వెనుక వైపు ఒక జత ఇన్‌బిల్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా ఉన్నాయి. మామూలుగా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కు ఒక ఛార్జింగ్ కేస్ ఉంటుంది. కానీ ఈ ఇయర్‌బడ్స్‌కు ఛార్జింగ్ కేస్ ఉండదు. ఎందుకంటే ఫోనే ఛార్జింగ్ కేస్‌లా పని చేస్తుంది. అలాగని ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నోకియా ఫోన్‌తో మాత్రమే పని చేస్తాయనుకుంటే పొరపాటే. ఇతర ఏ ఫోన్‌తోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇదే నోకియా ఫోన్ ద్వారా ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.
Sachin Tendulkar: మాజీ స్టార్ ప్లేయర్లతో విమానంలో సచిన్.. అభిమానుల్ని ఏం అడిగాడో తెలుసా!
ఈ ఫీచర్ ఫోన్లో లౌడ్ స్పీకర్, ఇన్‌బిల్ట్ ఎంపీ3 ప్లేయర్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ కూడా ఉన్నాయి. ఇక మెయిన్ ఫీచర్స్ విషయానికొస్తే… 1,450 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, 31 రోజుల స్టాండ్ బై టైమ్, 2.4 అంగుళాల డిస్‌ప్లే, న్యూమరిక్ అండ్ ఫంక్షనల్ కీస్, 4 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. ఈ నెల 19 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.4,999గా ఉండే అవకాశం ఉంది.
