Nothing First Store : బెంగళూరులో నథింగ్స్ ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ స్టోర్.. క్యూ కట్టిన కస్టమర్లు.. ఆటోలో ఎంట్రీ ఇచ్చిన సీఈఓ కార్ల్ పీ.. వీడియో వైరల్..!

Nothing First Store : నథింగ్ ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించింది. స్టోర్ ప్రారంభోత్సవానికి సీఈఓ కార్ల్ పీ ఆటోరిక్షాపై వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

Nothing Opens First Flagship Store

  • బెంగళూరులో నథింగ్ ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ ప్రారంభం
  • స్టోర్ ప్రారంభోత్సవానికి ఆటోలో వచ్చిన సీఈఓ కార్ల్ పీ
  • స్టోర్ ఫస్ట్ కస్టమర్ బిల్లుపై భారీ డిస్కౌంట్ ఇచ్చిన సీఈఓ

Nothing First Store : నథింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి ఫస్ట్ నథింగ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ వచ్చేసింది. లండన్‌కు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ బెంగళూరులోని ఇందిరానగర్‌లో ప్రారంభమైంది. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్ల్ పీ కూడా వచ్చేశారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్ల్ పీ బ్రాండెడ్ ఆటో-రిక్షాలో స్టోర్ ప్రారంభోత్సవానికి వచ్చారు. వైట్ ఆటో-రిక్షా నథింగ్ అద్భుతమైన బ్రాండింగ్‌తో అద్భుతంగా ఉంది. ఆయన స్టోర్ వెలుపలికి రాగానే అక్కడ ఉన్న అభిమానులు ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు, నినాదాలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

Read Also : Apple iPhone 16 Plus : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఈ ఆపిల్ ఐఫోన్ ఏకంగా రూ. 21వేలు తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!

ఫస్ట్ కస్టమర్ బిల్లు తగ్గించిన సీఈఓ :
నథింగ్ ఫ్లాగ్ షిప్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా కార్ల్ పీ స్వయంగా స్టోర్ మొదటి కస్టమర్ బిల్లుపై భారీ డిస్కౌంట్ అందించారు. స్టోర్ ఓపెన్ అవ్వక ముందే వందలాది మంది బారులు తీరారు. ఆ తర్వాత వినియోగదారుల సంఖ్య వేలకు పెరిగింది. బెంగళూరులో ఇంత పెద్ద స్థాయిలో బ్రాండ్ అభిమానులు రావడం విశేషంగా ఉందని, అఖండ స్పందనకు కార్ల్ పీ బెంగళూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు ఈ లాంచ్‌ను చిరస్మరణీయంగా అభివర్ణించారు. కొందరు ఈ లాంచ్ నథింగ్ కంపెనీ పెద్దగా ఏం ఉండదని అనుకున్నారని సరదాగా స్పందించారు. కానీ, లాంచ్ ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా ఉందని అన్నారు.

నథింగ్‌కు అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి :
ప్రపంచవ్యాప్తంగా నథింగ్ కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా కార్ల్ పీ వివరించారు. దేశంలో కంపెనీ వినియోగదారులలో ఎక్కువ మందికి బెంగళూరు నిలయంగా మారిందని తెలిపారు. అలాగే ఇక్కడ బలమైన టెక్ కమ్యూనిటీ ఉందని కూడా ఉందన్నారు. అందుకే కంపెనీ ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఇక్కడే ప్రారంభించాలని నిర్ణయించుకుంది.