Apple iPhone 16 Plus : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఈ ఆపిల్ ఐఫోన్ ఏకంగా రూ. 21వేలు తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!
Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ అసలు ధర రూ.89,900 నుంచి ఏకంగా రూ. 21 వేలు తగ్గింది.
Apple iPhone 16 Plus
- విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్లస్ రూ. 71,890కే లభిస్తోంది
- HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనంగా రూ. 3,500 డిస్కౌంట్
- ఆపిల్ A18 చిప్సెట్, ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు
- 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, IP68 రేటింగ్
Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు ఆండ్రాయిడ్ నుంచి కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే. విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ భారీ స్క్రీన్, A18 చిప్సెట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ సర్టిఫికేట్ అందిస్తుంది. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అయితే, ఈ ఐఫోన్ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో కేవలం రూ. 71,890కే లిస్ట్ అయింది. రూ. 18,010 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఐఫోన్ ధరను రూ. 3,500 తగ్గించవచ్చు.
Read Also : Gold Rates India : భారత్‌లో బంగారం ధరల్లో ఊహించని మార్పు.. పెట్టుబడిదారులకు షాకింగ్ ట్విస్ట్..!
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ A18 చిప్సెట్తో వస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల ఫుల్ సూట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది.
అదనంగా, ఐఫోన్ 16 ప్లస్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. కుపెర్టినో దిగ్గజం ప్రకారం.. ఈ హ్యాండ్సెట్ సింగిల్ ఛార్జ్‌పై 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఐఫోన్ 16 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ ఐఫోన్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాతో వస్తుంది.
