October New Rules : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. వంటగ్యాస్ నుంచి ఆధార్, బర్త్ సర్టిఫికెట్ వరకు కీలక మార్పులివే..
October New Rules : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. వంటగ్యాస్ సబ్సిడీ, ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ, బర్త్ సర్టిఫికేట్ వంటి పూర్తి నిబంధనలను తప్పకుండా తెలిసి ఉండాలి.. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- September 28, 2026 / 06:56 PM IST
October New Rules 2026
- అక్టోబర్ నెలలో రాబోయే కీలక మార్పులివే
- వంటగ్యాస్ సబ్సిడీకి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి
- జనన, మరణాల నమోదుపై కఠిన నిబంధనలు
October New Rules : వినియోగదారులకు బిగ్ అలర్ట్.. వచ్చే అక్టోబర్ నెలలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో కొన్ని సామాన్య ప్రజల జేబుపై నేరుగా ప్రభావం చూపుతాయి.
ముఖ్యంగా ఎల్పీజీ సబ్సిడీ, బ్యాంక్ డిపాజిట్ల వడ్డీ, జనన, మరణాల ఆలస్య నమోదు విషయంలో కొత్త నిబంధనలు (October New Rules) అమల్లోకి రానున్నాయి. తద్వారా వినియోగదారులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. ఏయే నిబంధనలు అమల్లోకి రానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎల్పీజీ సబ్సిడీకి ఆధార్ వెరిఫికేషన్ :
గృహ ఎల్పీజీ కస్టమర్లకు కీలక మార్పు. అక్టోబర్ 1 నుంచి రాయితీ ధరకు ఎల్పీజీ రీఫిల్ పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేసి ఉండాలి. అంటే.. మీ ఆధార్ వివరాలను బయోమెట్రిక్ విధానంలో వెరిఫై చేసుకుని ఉండాలి. ఇప్పటికే ఈ ప్రాసెస్ పూర్తి చేసిన వారికి మళ్లీ చేయాల్సిన పనిలేదు.
సెప్టెంబర్ 19 నాటికి దేశంలో 27.43 కోట్ల యాక్టివ్ గృహ ఎల్పీజీ కస్టమర్లు ఈ వెరిఫికేషన్ పూర్తి చేశారు. మొత్తంగా 89.9 శాతంగా నమోదైంది. ఇంకా వెరిఫికేషన్ పూర్తి చేయని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎల్పీజీ డెలివరీ సమయంలో ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లో కూడా చేసుకోవచ్చు. అలాగే సంబంధిత కంపెనీ యాప్ ద్వారా కూడా పూర్తి చేయొచ్చు.
ఇండేన్ కస్టమర్లు (IndianOil ONE) యాప్‌ను వాడొచ్చు. భారత్ గ్యాస్ కస్టమర్లు (HelloBPCL) యాప్ ద్వారా బుకింగ్ పూర్తి చేయవచ్చు. హెచ్‌పీ (HP Gas) కస్టమర్లు (HP PAY) యాప్‌ను ట్రై చేయొచ్చు. ఒకవేళ ఆధార్ వెరిఫికేషన్ చేయకపోతే గ్యాస్ సిలిండర్ పూర్తిగా ఆగిపోదు. అయితే, వర్తించే సబ్సిడీ నిలిచిపోవచ్చు. అప్పుడు సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
బ్యాంక్ డిపాజిట్ వడ్డీపై కొత్త విధానం :
బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నవారికి కూడా అక్టోబర్ నుంచి కీలక మార్పు అమల్లోకి రానుంది. ఒకే రకమైన డిపాజిట్లకు వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత ఉండనుంది. ఒకే తేదీన తీసుకున్న సమానమైన మొత్తాల డిపాజిట్లకు, వర్తించే నిబంధనలకు లోబడి, కస్టమర్ లేదా బ్రాంచ్‌ను బట్టి ఇష్టానుసారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వకూడదు.
Read Also : Unpaid Traffic Challans : ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఇక కరెంట్ కట్? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను ముందుగానే స్పష్టంగా వెల్లడించాలి. దీంతో కస్టమర్లు డిపాజిట్ చేసే ముందు వడ్డీ రేటును ఈజీగా తెలుసుకోవచ్చు. ఏ డిపాజిట్‌కు ఎంత వడ్డీ వస్తుందో ముందుగానే చెక్ చేసుకోవడం బెటర్.
జనన, మరణాల నమోదుపై కఠిన నిబంధనలు :
జనన, మరణాలను సమయానికి రిజిస్టర్ చేయకపోతే ఇకపై ప్రక్రియ మరింత కఠినంగా మారనుంది. ఒక ఏడాది దాటిన తర్వాత కానీ రెండు ఏళ్లలోపు రిజిస్టర్ చేయాలంటే సంబంధిత అధికారుల ధృవీకరణ, ఆదేశాలు తప్పనిసరి.
రెండు ఏళ్లకు మించి ఆలస్యమైతే జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆర్డర్స్ తీసుకోవాలి. అంటే.. చాలా కాలం తర్వాత జనన లేదా మరణాన్ని నమోదు చేయాలనుకునే వారు అదనపు పత్రాలు, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తప్పుడు వివరాలతో రికార్డులు సృష్టించేందుకు ఇక వీలుండదు.
సామాన్యులపై ప్రభావం ఏంటి? :
గ్యాస్ సబ్సిడీ కోసం ముందుగానే ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. బ్యాంకులో డిపాజిట్ చేసే వారు వడ్డీ రేట్లు, బ్యాంకు నిబంధనలను చెక్ చేసుకోవాలి. జనన లేదా మరణ నమోదు ఆలస్యమైతే మాత్రం ముందుగానే అవసరమైన డాక్యుమెంట్లు రెడీ చేసుకోవడం బెటర్.
ఏదైనా లావాదేవీ లేదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసే ముందు సంబంధిత ప్రభుత్వ శాఖ, బ్యాంకు లేదా ఎల్పీజీ సంస్థ నుంచి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. అక్టోబర్ 1 నుంచి వచ్చే ఈ మార్పులను చిన్న విషయాలుగా తీసుకోవద్దు.. ముందే చెక్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఉండవు.
