October 2026 Facelift : అక్టోబర్‌లో 5 కొత్త కార్లు రాబోతున్నాయి.. హోండా నుంచి టయోటా వరకు లేటెస్ట్ మోడల్స్ ఇవే!
October 2026 Facelift Lineup : అక్టోబర్ 2026లో భారత మార్కెట్లో 5 కొత్త ఫేస్‌లిఫ్ట్ కార్లు రాబోతున్నాయి. హోండా ఎలివేట్, స్కోడా స్లావియా, టయోటా గ్లాంజా, వోక్స్‌వ్యాగన్ వర్టస్, మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్-క్లాస్‌లో రానున్న మార్పులు, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- October 2, 2026 / 07:43 PM IST
October 2026 Facelift Lineup
- కారు కొనేవారికి గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో 5 కొత్త ఫేస్‌లిఫ్ట్ కార్లు
- అదిరిపోయే ఫీచర్లతో కొత్త కార్లు రాబోతున్నాయి
- హోండా ఎలివేట్ నుంచి టయోటా గ్లాంజా వరకు
October 2026 Facelift Lineup : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అక్టోబర్ 2026 సందడిగా మారనుంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ ప్రస్తుత మోడళ్లకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మెర్సిడెస్-మేబ్యాక్, హోండా, స్కోడా, టయోటా, వోక్స్‌వ్యాగన్ నుంచి మొత్తం 5 కొత్త అప్‌డేటెడ్ కార్లు ఈ నెలలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లతో రానున్నాయి. పూర్తి వివరాలివే..
మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్-క్లాస్ :
ఈ లగ్జరీ సెడాన్ అక్టోబర్ 5న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో కొత్త గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, స్టార్ ఆకారపు డీఆర్ఎల్ వంటి మార్పులు ఉండవచ్చు. క్యాబిన్‌లో ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి.
హోండా ఎలివేట్ :
అక్టోబర్ 6న రానున్న ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త ఎల్ఈడీ లైటింగ్, బంపర్లు, అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉండొచ్చు. 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు చేరే అవకాశం ఉంది.
స్కోడా స్లావియా :
అక్టోబర్ 6న స్లావియా ఫేస్‌లిఫ్ట్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 1.0 టీఎస్ఐ ఇంజిన్‌కు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మెయిన్ ఆకర్షణగా నిలవొచ్చు. క్యాబిన్ లోపల, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా ఉండొచ్చు.
టయోటా గ్లాంజా :
అక్టోబర్ 14న ఫేస్‌లిఫ్ట్ గ్లాంజా రావచ్చని అంచనా. కొత్త స్టైలింగ్, లైటింగ్, అల్లాయ్ వీల్స్‌తో పాటు క్యాబిన్‌లో అదనపు ఫీచర్లు ఉండొచ్చు. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, సుమారుగా 82.9 hp పవర్ మరియు 112.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT అందుబాటులో ఉంటాయి.
వోక్స్‌వ్యాగన్ వర్టస్ :
అక్టోబర్ చివరిలో దాదాపు 25న ఈ కారు లాంచ్ కానుంది. కొత్త వర్టస్‌లో డిజైన్, టెక్నాలజీ అప్‌డేట్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు రావచ్చు. 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. అయితే, ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే.. కంపెనీ అధికారిక ప్రకటన తర్వాతే ఫైనల్ స్పెసిఫికేషన్లపై క్లారిటీ రానుంది.
