OnePlus 12R Discount
OnePlus 12R Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్ భారీ డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం మీరు చూస్తుంటే ఇదే సరైన సమయం.
గత ఏడాదిలో వన్‌ప్లస్ 12ఆర్ మోడల్ వన్‌ప్లస్ ఫోన్ ఇటీవల జనవరిలో వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ వన్‌ప్లస్ 13ఆర్ విడుదలైన నెల తర్వాత వన్‌ప్లస్ 12ఆర్ అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
Read Also : Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు మాత్రం అసలు చేయొద్దు!
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.
100W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుత అందించే డిస్కౌంట్ ఆఫర్‌లను ఓసారి పరిశీలిద్దాం.
వన్‌ప్లస్ 12R డిస్కౌంట్ ఆఫర్లు :
ఈ ఫోన్ లాంచ్ సమయంలో వన్‌ప్లస్ 12ఆర్ బేస్ మోడల్ ధర రూ. 39,999, 256GB వేరియంట్ ధర రూ. 42,999కు అందుబాటులో ఉంది. మీకు తగినంత స్టోరేజీ కోసం చూస్తుంటే.. 256GB వెర్షన్ ఎంచుకోవచ్చు.
మీకు ఇదే సరైన అవకాశం. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై 23 శాతం తగ్గింపు అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 32,999కి తగ్గింది. మీ బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ. 3వేలు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ధరను కేవలం రూ. 29,999కి తగ్గింపు పొందవచ్చు.
మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. అమెజాన్ రూ.22,800 వరకు అద్భుతమైన ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందిస్తోంది. మీరు వన్‌ప్లస్ 12R ధరను మరింత తగ్గించవచ్చు.
ఉదాహరణకు.. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.12వేలు అనుకుంటే.. మీరు రూ.18వేల మాత్రమే చెల్లిస్తారు. అయితే, అసలు ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది.
వన్‌ప్లస్ 12R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 12R ఫోన్ 6.78-అంగుళాల 1.5కె, 10-బిట్ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, LTPO 4 టెక్నాలజీ, HDR10 ప్లస్ సపోర్ట్‌తో కలిగి ఉంది. ఇవన్నీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్ట్ అందిస్తుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14పై రన్ అయ్యే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్ ద్వారా పవర్ పొందుతుంది.
మీరు 128GB, 256GB స్టోరేజీ ఆప్షన్లలతో పాటు 8GB, 16GB RAM ఎంపికల మధ్య ఎంచుకోవచ్చు. ఈ ఫోన్ 100W సూపర్ వూక్ (SUPERVOOC) వైర్డ్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
బ్యాక్ కెమెరా సెటప్‌లో ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (సోనీ IMX89)తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీల విషయానికి వస్తే.. 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో USB 2.0 టైప్-సి పోర్ట్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ ఆడియోకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ కొలతలను పరిశీలిస్తే.. 75.3mm వెడల్పు, 8.8mm మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది.