OnePlus 13 Price Drop : వన్‌ప్లస్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

OnePlus 13 Price Drop : వన్‌ప్లస్ 13 ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వన్‌ప్లస్ తగ్గింపు ధరకే ఎలా పొందాలంటే? ఈ డీల్స్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు.

OnePlus 13 Price Drop

OnePlus 13 Price Drop : కొత్త స్మార్ట్‌‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గింది. మీకు పైసా ఖర్చు లేకుండా మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, వన్‌ప్లస్ 13 కొనేసుకోవచ్చు.

Read Also :  Tech Tips : మీ స్మార్ట్‌‌ఫోన్ బ్యాటరీ ఛార్జ్ ఫాస్ట్‌గా దిగిపోతుందా? ఈ 7 ఈజీ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 9,600 కన్నా ఎక్కువ తగ్గింపుతో లభ్యమవుతోంది. ముఖ్యంగా కొత్త ఫోన్‌కి మారాలని వారికి బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఎంత తొందరగా ఈ ఫోన్ కొనేసుకుంటే అంత బెటర్. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వన్‌ప్లస్ 13 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 రూ. 69,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 64,378కు లిస్ట్ అయింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ తగ్గింపు పొందాలంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.

వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13 HDR10+ సపోర్ట్‌తో 6.82-అంగుళాల LTPO 3K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : Oppo A5 Pro 5G : వారెవ్వా.. ఒప్పో కొత్త 5G ఫోన్ కిర్రాక్.. ఫీచర్లు మాత్రం హైలెట్ అంతే.. ఈ నెల 24నే లాంచ్.. గెట్ రెడీ!

ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13లో 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌లో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.