మరీ విడ్డూరం : పాక్‌ టీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అభినందన్

  • Publish Date - March 6, 2019 / 10:01 AM IST

ఢిల్లీ : పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని తరుముకుంటు వెళ్లిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ అధికారుల చెరలో ఉన్నప్పుడు అభినందన్ టీ తాగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభినందన్ పాకిస్థాన్ టీ బ్రాండ్ సిడర్ అంటు ఓ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసినవారు ఏంటీ ఎటకారమా..వరీ విడ్డూరంగా ఉందే అంటు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. 
Also Read : రమ్యపై నెటిజన్లు ఫైర్..తీసుకెళ్లి పాక్ లో వదిలిపెట్టండి

దాయాది యుద్ధవిమానాన్ని వెంబడిస్తూ పాక్‌లోకి అడుగుపెట్టిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ టీ తాగుతున్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజులపాటు పాకిస్థాన్ చెరలో ఉన్న అభినందన్ ధైర్యసాహసాలను ప్రదర్శించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మార్చి 1న పాక్ ఆయనను భారత్‌కు తిరిగి అప్పగించిన విషయం తెలిసిందే. 

పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన టీ కంపెనీ తపాల్ టీ కంపెనీ అభినందన్ వీడియోను ఎడిట్ చేసి క్యాష్ చేసుకుందామని ప్రయత్నించింది. శత్రుచెరలో ఉన్న సమయంలో తొలుత అభినందన్‌ను గాయపరిచినట్లున్న వీడియోలు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా పాక్ ఆర్మీ సిబ్బంది వింగ్ కమాండర్ అభినందన్‌కు సపర్యలు చేసినట్లుగా వీడియో తీశారు. అందులో అభినందన్ టీ తాగుతూ పాక్ అధికారుల ప్రశ్నలకు బదులివ్వడం తెలిసిందే. 
Also Read : #WednesdayWisdom : అభినందన్‌పై స్మృతి మీమ్స్

తపాల్ టీ బ్రాండ్.. అభినందన్ చెప్పిన ‘టీ ఈజ్ ఫెంటాస్టిక్. థ్యాక్యూ’ అనే మాటలను తమ వాణిజ్య ప్రకటన వీడియోకు జత చేసింది. వారు వీడియో పోస్ట్ చేయడం మొదలుకుని నెటిజన్లతో పాటు పాక్ మీడియా సైతం అభినందన్ టీ ప్రకటన వీడియో అంటూ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో తపాట్ టీ బ్రాండ్ క్రియేట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.