PAN Card Rules : బిగ్ బ్రేకింగ్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. రూ.10 లక్షలు దాటితే PAN కార్డు మస్ట్..!
PAN Card Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్ కార్డు ఏయే విషయాల్లో అవసరం పడుతుంది? ఇప్పుడు ఎంత పరిమితి పెరిగిందో వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published On : March 23, 2026 / 02:05 PM IST
PAN Card Rules 2026
- ఏప్రిల్ 1 నుంచి రానున్న పాన్ కార్డు కొత్త రూల్స్
- పాన్ కార్డు నిబంధనల్లో భారీగా మార్పులు
- కొత్త పాన్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ ఉండాల్సిందే
- ఆర్థిక లావాదేవీల్లో ఎంత పరిమితి ఉంటే పాన్ అవసరం?
PAN Card Rules : మీకు పాన్ కార్డు ఉందా? పాన్ కార్డు కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ 1,2026 నుంచి పాన్ కార్డుకు సంబంధించి కీలక నిబంధనలు మారనున్నాయి. అలాగే దరఖాస్తు నియమాలు కూడా మారబోతున్నాయి.
అదనపు డాక్యుమెంట్ల నుంచి కొత్త పన్ను నిబంధనల వరకు పన్ను చెల్లింపుదారులు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. పాన్ కార్డు కొత్త నిబంధనలతో ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
పాన్ కార్డుకు సంబంధించి లావాదేవీల పరిమితులను కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఆదాయపు పన్ను నిబంధనలు 2026ను నోటిఫై చేసింది. పాన్ కార్డు లావాదేవీ పరిమితులను సవరించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మీరు పాన్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. త్వరలో ఈ ప్రక్రియకు కేవలం ఆధార్ మాత్రమే కాకుండా మరిన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
రూ. 10 లక్షలు దాటితే పాన్ కార్డు :
మీ బ్యాంకు అకౌంటులో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా ఆపై ఎక్కువ క్యాష్ ఒకేసారి లేదంటే విడతల వారీగా డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేయడం చేసినా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. అది మీరు ఒకే బ్యాంకులో కావొచ్చు లేదా వేర్వేరు బ్యాంకుల్లో కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు ఒక రోజులో రూ.50 వేలు దాటితేనే పాన్ కార్డు అవసరం పడుతుంది.
ఆస్తి లావాదేవీలు రూ. 20 లక్షలకు పెంపు :
ఇళ్ల కొనుగోళ్లు, స్థలాల అమ్మకాలు, గిఫ్ట్, డెవలప్మెంట్ డీల్స్ విషయాల్లో కూడా లావాదేవీ వాల్యూ రూ.20 లక్షలు దాటితే మాత్రం పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరిమితి రూ.10 లక్షలు ఉండేది. స్థిరాస్థి ధరలు పెరగడంతో ఈ ప్రస్తుత పరిమితిని రెట్టింపు చేసింది.
హెటళ్లు, రెస్టారెంట్ల బిల్లులు రూ. లక్షకు పెంపు :
అలాగే, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చేసే ఆర్థిక లావాదేవీలపై కూడా రూ.లక్ష దాటితే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్ల బిల్లులు రూ.50 వేలు ఉంటేనే పాన్ కార్డు అవసరం పడుతుంది. ఇకపై ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచారు.
ఏప్రిల్ 1 నుంచి వాహనాల కొనుగోళ్లపై కూడా పాన్ అవసరం పడుతుంది. బైక్‌లు, మోటారు వాహనం కోనుగోలు చేసినా వాల్యూ కూడా రూ.5 లక్షలు దాటితే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏదైనా బైక్ కొంటే పాన్ కార్డు ఇచ్చే పనిలేదు. కొత్త వాహనచట్టం ప్రకారం.. ఇక నుంచి కొత్త బైకు కొనుగోళ్ల సమయంలో కూడా పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది.
అదే మీరు కారు లేదా ఏదైనా వాహన కొంటే ధర ఎంత ఉన్నా సరే పాన్ కార్డు తప్పనిసరి. ముఖ్యంగా రూ. 5 లక్షల పైబడిన వాటికి మాత్రమే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ప్రతీ బీమా పాలసీకి కూడా పాన్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతానికి వార్షిక ప్రీమియం రూ.50 వేలు దాటితేనే పాన్ కార్డు అందించాల్సి ఉంటుంది.
మీరు పాన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే కేవలం ఆధార్‌ను ఉపయోగించి 2026 మార్చి 31 లోపు అప్లయ్ చేసుకోవచ్చు.
