PAN Card Update
PAN Card Update : కొత్త పాన్ కార్డు కావాలా? కేవలం 5 నిమిషాల వ్యవధిలో కొత్త ఇ-పాన్ కార్డు తీసుకోవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు విషయంలో కొత్త రూల్ (PAN Card Update) తీసుకొచ్చింది. ఆధార్ కార్డుతో మాత్రమే పాన్ కార్డు పొందవచ్చు. ప్రస్తుతం గుర్తింపు కార్డుపై మీ పేరు, ఫొటో గురించి మాత్రమే కాదు.. డిజిటల్ డాక్యుమెంట్లు కూడా అవసరం.
అతి ముఖ్యమైన డిజిటల్ డాక్యుమెంట్లలో పాన్ కార్డ్. పాన్ కార్డ్ (శాశ్వత ఖాతా సంఖ్య) అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ గుర్తింపు సంఖ్య. ఐటీ శాఖ ఆర్థిక లావాదేవీలు, పన్నులను ట్రాక్ చేస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139A కింద పాన్ కార్డును ప్రవేశపెట్టింది.
పాన్ కార్డ్ నిబంధనలలో కొత్త మార్పులు :
జూలై 1, 2025 నుంచి ప్రభుత్వం పాన్ కార్డుల కోసం కొత్త రూల్ రూపొందించింది. ఇప్పుడు, కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. కొత్త పాన్ కార్డు కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ లేదా బర్త్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లు పనికిరావు. మీకు ఆధార్ కార్డు లేకపోతే కొత్త పాన్ కార్డు పొందలేరు. ఒకవేళ, మీకు ఇప్పటికే పాన్ కార్డ్ ఉంటే.. డిసెంబర్ 31, 2025 లోపు మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి.
ఈ తేదీకి ముందు మీరు దాన్ని లింక్ చేయకపోతే.. జనవరి 1, 2026 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయడం ఆగిపోతుంది. మీ పాన్ కార్డ్ ఇన్ యాక్టివ్‌గా మారితే.. చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేరు. కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో పేమెంట్లు చేయలేరు.
టాక్స్, నగదు లావాదేవీల విషయంలో మోసాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. మీ ఆధార్ కార్డు రెడీగా ఉంటే.. కొన్ని నిమిషాల్లో సులభంగా ఇ-పాన్ కార్డును జనరేట్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి.. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి OTPతో ధృవీకరించాలి. అప్పుడు మీ ఇ-పాన్ కార్డు జనరేట్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో వేగంగా పూర్తి చేయొచ్చు.
ఇంటి నుంచే ఆధార్ పాన్‌తో లింక్ ఎలా? :