పేటీఎంలోకి స్టాక్ మార్కెట్ : బ్రోకింగ్ సర్వీసుకు సెబీ ఆమోదం

ప్రముఖ భారత అతిపెద్ద డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాం పేటీఎంలోకి స్టాక్ మార్కెట్ సర్వీసు వచ్చేస్తోంది. మ్యూట్ వల్ ఫండ్ ఇన్విస్ట్ మెంట్స్ సర్వీసును అందిస్తోన్న పేటీఎం మనీకి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి సభ్యుత్వానికి ఆమోదం లభించింది.

  • Publish Date - April 2, 2019 / 12:33 PM IST

ప్రముఖ భారత అతిపెద్ద డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాం పేటీఎంలోకి స్టాక్ మార్కెట్ సర్వీసు వచ్చేస్తోంది. మ్యూట్ వల్ ఫండ్ ఇన్విస్ట్ మెంట్స్ సర్వీసును అందిస్తోన్న పేటీఎం మనీకి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి సభ్యుత్వానికి ఆమోదం లభించింది.

ప్రముఖ భారత అతిపెద్ద డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాం పేటీఎంలోకి స్టాక్ మార్కెట్ సర్వీసు వచ్చేస్తోంది. మ్యూట్ వల్ ఫండ్ ఇన్విస్ట్ మెంట్స్ సర్వీసును అందిస్తోన్న పేటీఎం మనీకి BSE, NSE నుంచి సభ్యుత్వానికి ఆమోదం లభించింది. వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ రన్ చేస్తున్న పేటీఎం ప్లాట్ ఫాంపై ఇక నుంచి స్టాక్ మార్కెట్ షేర్లు కూడా చూసుకోవచ్చు. షేర్లు కొనొచ్చు.. అమ్ముకొవచ్చు కూడా. SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) తమ యూజర్ల కోసం స్టాక్ బ్రోకింగ్ సర్వీసులను ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం ప్రకటించింది. మంగళవారం (ఏప్రిల్ 2, 2019) పేటీఎం మనీకి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) అండ్ నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (NSE) నుంచి  సభ్యుత్వానికి ఆమోదం లభించినట్టు తెలిపింది. 
Read Also : డేటా ఆఫర్లు అదుర్స్ : ఏప్రిల్ 4 నుంచి జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్

పేటీఎం యాప్ ప్లాట్ ఫాంపై కొత్త ప్రొడక్ట్ లను ఆఫర్లపై ప్రవేశపెట్టడం, ఈక్విటీల్లో ఇన్వెస్టింగ్, ట్రేడింగ్, డెరివేటీవ్స్, కరెన్సీ, ఉత్పత్తులు, ETF, ఇతర ఎక్సేంజ్ ట్రేడింగ్ ప్రొడక్టులను ఆఫర్ చేసేందుకు పేటీఎం ప్లాన్ చేస్తోంది. స్టాక్ మార్కెట్ ఆమోదంతో.. పేటీఎం మనీ ప్లాట్ ఫాం ఫుల్ స్టాక్ వెల్త్ మేనేజ్ మెంట్ ప్లాట్ ఫాంగా ముందుకు వెళ్లడమే లక్ష్యం. మిలియన్ల మంది భారతీయులకు Stock Market లో అవకాశాలు కల్పించి ఈజీగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా Paytm Money ప్లాట్ ఫాం సర్వీసును డెవలప్ చేయనున్నాం. కొన్ని నెలల్లో అన్ని ఎక్సేంజ్ ట్రెడెడ్ ప్రొడక్టులను యూజర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని పేటీఎం మనీ హోల్ టైం డైరెక్టర్ ప్రావీణ్ జాదవ్ తెలిపారు. 

పేటీఎం మనీలో స్టాక్ ట్రేడింగ్ సర్వీసు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. స్టాక్ మార్కెట్ ప్రొడక్టుల అప్ డేట్స్, ఆఫర్లు, ఫీచర్లు, ధరలకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇండియాలో పేటీఎం మనీ డైరెక్ట్ మ్యూటవల్ ఫండ్స్ లో కమిషన్ ఆఫర్ చేస్తూ ఉచితంగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయం కల్పించింది. దీంతో 6 నెలల్లోనే Paytm Money ఒక మిలియన్ (పది లక్షలు) యూజర్ల మార్క్ ను దాటేసింది.
Read Also : వాట్సాప్‌లో Tipline సర్వీసు : ఎన్నికల వేళ.. Fake News చెక్ పాయింట్

Paytm యూజర్లకు ఇన్విస్టింగ్ ప్రాసెస్ ను సులభంతరం చేసేందుకు పలు ఫీచర్లను కంపెనీ ప్రవేశపెట్టింది. ఇటీవలే ఇన్వెస్ట్ మెంట్ ప్యాక్స్ ను తీసుకొచ్చింది. అడ్వైజరీ టీంతో మ్యూటవల్ ఫండ్స్ పై రీసెర్చ్ చేసిన అనంతరం ఈ ఇన్వెస్ట్ మెంట్ ప్యాక్స్ ను అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు కేంద్రంగా పేటీఎం మనీ సర్వీసును రన్ చేస్తుండగా.. హోల్ టైం డైరెక్టర్, ప్రావీణ్ జాదవ్ నేతృత్వంలో 250 మంది సభ్యుల బృందం పనిచేస్తోంది. 

మ్యూటవల్ ఫండ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన పేటీఎం మనీ.. 38 AMC (అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు)లతో కలిపి మొత్తం 95 శాతం ఇండస్ట్రీలతో భాగస్వామిగా ఉంది. పీటీఎం మనీతో పాటు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కూడా 300 మంది మిలియన్లు (30 కోట్లు) రిజిస్ట్రర్డ్ యూజర్లు.. ఈ యాప్ నుంచి స్టాక్ మార్కెట్ షేర్లు, అమ్మడం కొనుగోలు చేయడం చేసుకోవచ్చు.

ఇండియన్ బ్యాంకుల్లో Kotak, ICICI, HDFC తో పాటు కొన్ని ఆన్ లైన్ ప్లేయర్లు Stock Broking సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. అందులో మేజర్ Online ప్లాట్ ఫాం.. బెంగళూరు ఆధారిత జీరోధా బ్రోకరేజ్ ఫ్రీ ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్లు, రిటైల్, ఇన్ స్టిట్యూషనల్ బ్రోకింగ్, కరెన్సీలు, ఉత్పత్తులపై ఆఫర్ చేస్తోంది. అలాగే పుణె ఆధారిత ఆన్ లైన్ ప్లాట్ ఫాం జాంబాలా కూడా AI టెక్నాలజీ సాయంతో తమ యాప్ పై యూజర్లకు స్టాక్స్ అమ్మడం, కొనేందుకు అవకాశం కల్పిస్తోంది.