Cheapest Personal Loans : పర్సనల్ లోన్ కావాలా? ఈ సెప్టెంబర్‌లో అతి తక్కువ వడ్డీతో రుణాలిచ్చే బ్యాంకులివే.. ఫుల్ లిస్టు..!
Cheapest Personal Loans : సెప్టెంబర్ నెలలో పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సస్ బ్యాంకులు సహా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ప్రారంభ వడ్డీ రేట్ల వివరాలివే..
- Sreehari A
- Published on- September 6, 2026 / 12:06 PM IST
Personal Loan Interest Rates 2026
- సెప్టెంబర్‌లో పర్సనల్ లోన్ రేట్లు.. తక్కువ వడ్డీ ఎక్కడంటే?
- లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువ
- రూ.లక్షల లోన్‌కు ఎక్కువ వడ్డీ ఎందుకు? తక్కువ రేట్లు ఉన్న బ్యాంకులు
Personal Loan Interest Rates 2026 : పర్సనల్ లోన్ కావాలా? ఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్లు ఇస్తున్నాయో తెలుసా? ఈ సెప్టెంబర్ 2026లో పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తుంటే ఇది మీకోసమే..
అయితే, ముందుగా బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను తప్పనిసరిగా చెక్ చేయాలి. పర్సనల్ లోన్లపై సాధారణంగా వడ్డీ ఎక్కువగానే ఉంటుంది. అందుకే, తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకును ఎంచుకుంటే రుణంపై చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ప్రభుత్వ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు :
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పర్సనల్ లోన్లకు ప్రస్తుతం ప్రారంభ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 9.05 శాతం
- కెనరా బ్యాంక్ : 9.70 శాతం
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) : 10.00 శాతం
- బ్యాంక్ ఆఫ్ బరోడా : 10.15 శాతం
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 10.25 శాతం
- బ్యాంక్ ఆఫ్ ఇండియా : 10.85 శాతం
ఈ లిస్టులో 9.05 శాతంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ బ్యాంకుల్లో తక్కువ ప్రారంభ వడ్డీ రేటును అందిస్తుండగా ఆ తర్వాత కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి.
Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. జీతం పెంపుతో పాటు HRAలోనూ బంపర్ బెనిఫిట్!
ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు :
ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..
- యాక్సిస్ బ్యాంక్ : 8.75 శాతం
- ఐసీఐసీఐ బ్యాంక్ : 9.99 శాతం
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ : 9.99 శాతం
- కోటక్ మహీంద్రా బ్యాంక్ : 10.99 శాతం
- ఇండస్‌ఇండ్ బ్యాంక్ : 12.00 శాతం
ఈ వడ్డీ రేట్లను బట్టి చూస్తే.. 8.75 శాతంతో యాక్సిస్ బ్యాంక్ ఈ లిస్టులో అత్యల్ప ప్రారంభ వడ్డీ రేటును అందిస్తుంది.
లోన్లతో జర జాగ్రత్త :
మీరు ఏదైనా పర్సనల్ లోన్లు తీసుకునే ముందు ఓసారి ఆలోచించండి. ఈ లోన్లలో కేవలం ప్రారంభ వడ్డీ రేట్లు మాత్రమే. ప్రతి కస్టమర్‌కు ఇదే రేటు వర్తిస్తుందని చెప్పలేం. క్రెడిట్ స్కోర్, ఆదాయం, రుణ మొత్తం, ఉద్యోగ వివరాలు, లోన్ టెన్యూర్ వంటి అంశాలను బట్టి బ్యాంకు అసలు వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.
అందుకే లోన్ తీసుకునే ముందు కేవలం వడ్డీ రేటును మాత్రమే కాదు.. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు, నెలవారీ ఈఎంఐ, రీపేమెంట్ వంటివి కూడా చెక్ చేసుకోవాలి. ఇచ్చిన వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. ప్రైవేట్ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ తక్కువ ప్రారంభ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
