Senior Citizens Alert : ఈ బ్యాంకులో FD ఉందా? 271 రోజులకే అదిరిపోయే వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు ఎంత లాభమంటే!
Senior Citizens Alert : బ్యాంక్ ఆఫ్ బరోడా 271 రోజుల FDపై సాధారణ ఖాతాదారులకు 6శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50శాతం వడ్డీని అందిస్తోంది. పెట్టుబడి పరిమితి, అదనపు బెనిఫిట్స్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Senior Citizens Alert
- సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. 271 రోజుల FDపై 6.50శాతం వడ్డీ
- రూ.3 కోట్ల వరకు FD పెట్టుబడి.. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు
- తక్కువ కాలంలో స్థిరమైన రాబడి.. బ్యాంక్ ఆఫ్ బరోడా FD వివరాలు
Senior Citizens Alert : సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్.. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఫిక్స్డ్ డిపాజిట్ల (FD)పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది.
తక్కువ కాలంలో తమ డబ్బుపై స్థిరమైన రాబడిని పొందాలనుకునే వారికి 271 రోజుల ఎఫ్డీ పథకం అద్భుతమైన ఆప్షన్. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారులతో పోలిస్తే అధిక వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ ఏంటి? పూర్తి వివరాలేంటో చూద్దాం..
271 రోజుల FDపై ఎంత వడ్డీ? :
బ్యాంక్ ఆఫ్ బరోడా 271 రోజుల కాలపరిమితి గల ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు 6.00 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే.. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ ప్రయోజనం ఉంటుంది.
ఈ వడ్డీ రేట్ల ప్రకారం.. అర్హతలు, వర్తించే నిబంధనలకు లోబడి సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడిపై కొంత ఎక్కువ రాబడిని పొందే అవకాశం ఉంది. అయితే, వాస్తవంగా చేతికి వచ్చే మొత్తం వడ్డీ లెక్కింపు విధానం, పేమెంట్ ఆప్షన్, పన్నులపై ఆధారపడి ఉంటుంది.
గరిష్ఠంగా ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? :
ఈ ఎఫ్డీ పథకంలో గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ.3 కోట్ల వరకు పెట్టొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు వివిధ కాలపరిమితులతో ఎఫ్డీ పథకాలను అందిస్తోంది. తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా డిపాజిట్ టెన్యూర్ ఎంచుకోవచ్చు.
సూపర్ సీనియర్ సిటిజన్లకు స్పెషల్ బెనిఫిట్స్ :
ఎంపిక చేసిన FD పథకాలపై వెరీ సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.10 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తుంది. అయితే, 271 రోజుల FDపై సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది.
Note : ఫిక్స్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే ముందు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లేదా బ్రాంచులో లేటెస్ట్ వడ్డీ రేట్లు, అర్హతలు, నిబంధనలను తెలుసుకోవడం ముఖ్యం.. వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంటుంది.
