Cheapest Home Loans : ఫస్ట్ టైమ్ ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లు ఇచ్చే బ్యాంకులివే.. ఎందులో తక్కువంటే?
Cheapest Home Loans : కొత్త ఇల్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ మార్చి 2026లో చీపెస్ట్ బ్యాంకు లోన్లను అందించే ప్రైవేట్ బ్యాంకులు చాలానే ఉన్నాయి. ఏయే ప్రైవేట్ బ్యాంకులు అత్యంత చౌకైన గృహ రుణాన్ని అందిస్తున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..
- Sreehari A
- Published On : March 20, 2026 / 02:27 PM IST
Cheapest Home Loans
- కొత్త ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?
- మార్చిలో హోం లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు
- ఏయే బ్యాంకులు చీపెస్ట్ హోం లోన్లను అందిస్తున్నాయి
- హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కోటక్ మహీంద్రా వరకు బ్యాంకులివే
Cheapest Home Loans : సొంతిల్లు కల అందరికి ఉంటుంది. కానీ, పెరుగుతున్న ఖర్చులతో ఈరోజుల్లో ఇల్లు కొనడం చాలా కష్టంగా మారుతోంది. ఫలితంగా, చాలా మంది ఇప్పుడు సొంత ఇళ్లను కొనేందుకు బ్యాంకులపై ఆధారపడుతున్నారు. హోం లోన్లు తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలోని అన్ని బ్యాంకులు గృహ రుణాలను అందిస్తాయి.
గృహ రుణ వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. మీరు ప్రస్తుతం హోం లోన్ తీసుకోవాలని చూస్తుంటే ముందుగా బ్యాంకుల గృహ రుణ వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవాలి. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల గృహ రుణ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మార్చి 2026లో ఏ ప్రైవేట్ బ్యాంకు అత్యంత చౌకైన గృహ రుణాన్ని అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
HDFC బ్యాంక్ హోం లోన్ వడ్డీ రేట్లు :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు తమ కస్టమర్లకు 7.75 శాతం నుంచి వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తుంది. ఈ గృహ రుణ వడ్డీ రేట్లు కస్టమర్ల క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి మారవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ హోం లోన్ వడ్డీ రేట్లు :
ఐసీఐసీఐ బ్యాంక్ గృహ రుణ వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. 7.45 శాతం నుంచి వడ్డీ రేట్లతో హోం లోన్లను అందిస్తుంది. ఈ గృహ రుణ వడ్డీ రేట్లు కస్టమర్ల క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి మారుతుంది.
యాక్సిస్ బ్యాంక్ హోం లోన్ వడ్డీ రేట్లు :
యాక్సిస్ బ్యాంక్ తమ కస్టమర్లకు 8శాతం నుంచి ప్రారంభమయ్యే హోం లోన్లను అందిస్తుంది. ఈ హోం లోన్లపై వడ్డీ రేట్లు యూజర్ క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి మారవచ్చు.
బంధన్ బ్యాంక్ గృహ రుణ వడ్డీ రేట్లు :
బంధన్ బ్యాంక్ తమ కస్టమర్లకు 8.41 శాతం నుంచి వడ్డీ రేటుతో హోం లోన్లను అందిస్తుంది. గృహ రుణ వడ్డీ రేట్లు కస్టమర్ల క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి మారవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీ రేట్లు :
కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ కస్టమర్లకు 7.70శాతం వడ్డీతో గృహ రుణాలను అందిస్తుంది. వినియోగదారుని క్రెడిట్ స్కోర్, రుణ ఎంత కావాలి? ఇతర అర్హత ప్రమాణాలను బట్టి వడ్డీ రేట్లు మారవచ్చు.
