Electronics Price Hike : పండగకు ముందే బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి AC, TV, ఫ్రిజ్ ధరలకు రెక్కలు!

Electronics Price Hike : పండగ సీజన్‌కు ముందు ఏసీ, టీవీ, ఫ్రిజ్ ధరలు భారీగా పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. 3-8 శాతం వరకు ధరలు పెరగనున్నాయి.. పూర్తి వివరాలివే..

  • Published on- September 27, 2026 / 08:03 PM IST

Electronics Price Hike

  • ఏసీ, టీవీ, ఫ్రిజ్ కొంటున్నారా? అక్టోబర్ నుంచి ధరలు పైకి!
  • పండగ కొనుగోళ్లకు షాక్.. ఎలక్ట్రానిక్స్ ధరలు 3-8శాతం పెంపు
  • ఎలక్ట్రానిక్స్ కొనాలంటే ఇదే టైమ్? అక్టోబర్ నుంచి బాదుడే

Electronics Price Hike : పండగ సీజన్‌లో కొత్త ఏసీ, టీవీ, ఫ్రిజ్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో బిగ్ షాకింగ్ న్యూస్. పండగ కొనుగోళ్లు ఊపందుకునే ముందే గృహోపకరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే వారికి భారీ మొత్తంలో జేబుకు చెల్లు పడనుంది.

ముఖ్యంగా గృహోపకరణాల ధరలు 3 శాతం నుంచి 8 శాతం వరకు పెరగనున్నాయి. అలాగే, ఏసీ ధరల్లో 5 శాతం నుంచి 8 శాతం వరకు పెంపు (Electronics Price Hike) ఉండనుంది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఇతర హోమ్ అప్లయెన్సెస్‌ ధరల్లోనూ భారీగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే, ఏ ప్రొడక్టుపై ఎంత ధర పెరుగుతుందనేది బ్రాండ్, మోడల్, ఫీచర్లు, విక్రయ మార్కెట్‌ను బట్టి మారుతుంది.

ఎలక్ట్రానిక్స్ ధరలకు రెక్కలు :
గృహోపకరణాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు, రవాణా, సరఫరా ఖర్చులు పెరగడం వంటివి ప్రొడక్టుల తుది ధరలపై ప్రభావం చూపనున్నాయి. దీంతో తయారీ సంస్థలు కూడా తమ ప్రొడక్టుల ధరలను సవరించనున్నాయి. పండగ సీజన్‌ ప్రారంభం కావడంతో ఎలక్ట్రానిక్స్‌కు డిమాండ్ మరింత పెరగనుంది. ఇదే సమయంలో ధరల పెంపు అమల్లోకి వస్తే కొత్త వస్తువులు కొనుగోలు చేసేవారి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఐఫోన్ 17, ఐఫోన్ 15 మోడళ్లపై రూ. 20వేలు తగ్గింపు!

పండగ వేళ జేబుకు చెల్లు.. :
పండగ సీజన్‌లో సాధారణంగా ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, ధరలు పెరిగిన తర్వాత ఇచ్చే డిస్కౌంట్‌ను చూసి మాత్రమే కొనుగోలు చేయకుండా పాత ధర, కొత్త ధర, డిస్కౌంట్ తర్వాత చెల్లించాల్సిన మొత్తం మధ్య తేడా చూసి కొనుక్కోవడం మంచిది.

ఏసీ, టీవీ, ఫ్రిజ్ వంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఒకే మోడల్‌ ధరను వివిధ స్టోర్లలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కంపేర్ చేసుకోవాలి. ఎక్స్ఛేంజ్ వాల్యూ, వారంటీ, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, అదనపు యాక్సెసరీల ఖర్చు కూడా లెక్కలోకి తీసుకోవాలి.

అక్టోబర్‌ నుంచి ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ముందుగానే తమ బడ్జెట్‌ను రెడీ చేసుకోవడం బెటర్. ముఖ్యంగా పండగ సీజన్‌ ఆఫర్లు కనిపించగానే వెంటనే కొనుగోలు చేయకుండా, ఇచ్చే డిస్కౌంట్‌ నిజంగా ఎంత? ఆ తగ్గింపుతో ఎంత ఆదా అవుతుంది? ధరల పెంపు తర్వాత కూడా బడ్జెట్‌లో ఎంతవరకు సరిపోతుంది? అనే విషయాలను ముందుగా లెక్కేసుకోవాలి. ఆఫర్‌ చూడగానే తొందరపడి కొనకపోవడమే బెటర్..