×
Ad

Buy Mid Size SUV : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. మిడ్-సైజ్ SUVలో 5 బెస్ట్ సెల్లింగ్ కార్లు.. షోరూంకు క్యూ కట్టి కొనేస్తున్నారు!

Buy Mid Size SUV : అత్యుత్తమ మిడ్-సైజ్ SUV కోసం ప్లాన్ చేస్తున్నారా? మిడ్-సైజ్ SUV కార్లలో మీకు నచ్చిన మోడల్ కారు కొనేసుకోండి. ఏ మోడల్ కారు కొంటే బెటర్ అంటే?

  • Published On : February 20, 2026 / 06:02 PM IST

Buy Mid Size SUV

  • కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?
  • భారీగా అమ్ముడవుతున్న 5 మిడ్ సైజు SUV కార్లు
  • హ్యుందాయ్ క్రెటా నుంచి మారుతి సుజుకి గ్రాండ్ విటారా

Buy Mid Size SUV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో వివిధ కార్ల తయారీదారులు వివిధ కేటగిరీల్లో అనేక కార్లను అందిస్తున్నారు. అందులో మిడ్-సైజ్ SUV ఒకటి. మీరు భవిష్యత్తులో బెస్ట్ మిడ్-సైజ్ SUV కొనేందుకు చూస్తుంటే ఈ కార్లలో ఒకటి కొనేసుకోండి. భారత మార్కెట్లో అత్యంత పాపులర్ బెస్ట్ సెల్లింగ్ మిడ్-సైజ్ SUV కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ బెస్ట్ ఐదు కార్లలో మీకు ఏ కారు కావాలో కొనేసుకోండి.

హ్యుందాయ్ క్రెటా :
హ్యుందాయ్ మిడ్-సైజ్ SUV, హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUVలలో ఒకటి. ఈ రెండు కార్లలో మీకు నచ్చిన కారు కొనేసుకోవచ్చు. హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.79 లక్షలు అయితే, ఆన్-రోడ్ ధరలు వివిధ నగరాల్లో మారవచ్చు. హ్యుందాయ్ క్రెటా అనేక అడ్వాన్స్ ఫీచర్లు, వైడ్ రేంజ్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి విక్టోరిస్ :
భారత మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి వైడ్ రేంజ్ కార్లను అందిస్తుంది. మీరు కొనేందుకు SUV మారుతి సుజుకి విక్టోరిస్ రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్ వేరియంట్ రూ. 23.23 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Read Also : Bixby One UI 8.5 : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. మీ ఫోన్‌లో ఇక సెట్టింగ్స్ పేర్లు గుర్తుపెట్టుకోనక్కర్లేదు.. బిక్స్‌బీ AIతో మాట్లాడితే చాలు!

కియా సెల్టోస్ :

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా నుంచి వచ్చిన మిడ్-సైజ్ SUV కార్లలో కియా సెల్టోస్ ఒకటి. మీరు కొనుగోలు చేసే అత్యుత్తమ SUVలలో ఇదికటి. ఈ SUV భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన SUV కూడా. కియా సెల్టోస్ ధర రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమైతే టాప్-స్పెక్ వేరియంట్ రూ. 23.96 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

టయోటా హైరైడర్ :
కార్ల తయారీ సంస్థ టయోటా నుంచి వచ్చిన టయోటా హైరైడర్.. అత్యుత్తమ మిడ్-సైజ్‌ఎస్ యూవీ కార్లలో ఒకటి. ఈ SUV కూడా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నిలిచింది. టయోటా హైరైడర్ ధర రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-స్పెషిఫికేషన్ వేరియంట్ రూ. 23 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా :
భారత మార్కెట్లో అత్యంత పాపులర్, అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV ఒకటి. ఈ కారు కొనాలంటే కొనేసుకోవచ్చు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు రూ. 10.76 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. అయితే, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.