PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ కొత్త ట్విస్ట్ : 22వ విడత హోలీ తర్వాత ఎప్పుడైనా రావొచ్చు.. ఈ తప్పు చేస్తే రూ.2వేలు పడవు
PM Kisan 22nd Installment 2026: పీఎం కిసాన్ యోజనలో లబ్ధిదారుల రైతులకు 22వ విడత ఈ వారంలో ఎప్పుడైనా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎవరికి రూ. 2వేలు అందుతాయి? ఎవరికి అందవు? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- Sreehari A
- Published On : March 3, 2026 / 02:36 PM IST
PM Kisan 22nd Installment 2026 ( Image Credit : Gemini AI )
PM Kisan 22nd Installment 2026 : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్‌డేట్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 22 వాయిదా అతి త్వరలో విడుదల కానుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రూ. 2వేల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈసారి 22వ వాయిదా అర్హులైన రైతులు మాత్రమే అందుకుంటారు. సాధారణంగా ఈ పథకం రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్థిక సాయం అందిస్తుంది. లబ్ధిదారు రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
ఈ డబ్బును రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకూ 21 వాయిదాలు విడుదల అయ్యాయి. ఈసారి 22వ విడత రావాల్సి ఉంది. అయితే, ఈ విడతకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఫిబ్రవరిలోనే వస్తుందని అందరూ భావించారు.
ఈ మార్చిలో హోలీ తర్వాత 22వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈలోగా లబ్ధిదారు రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ఇకేవైసీ చాలా ముఖ్యం. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులకు మాత్రం రూ. 2వేలు అందవు. ఈ డబ్బులు పడాలంటే రైతులు ఏం చేయాలి? అసలు ఎవరు అర్హులు? కేవైసీని ఎలా పూర్తి చేయాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
22వ విడత ఎప్పుడు విడుదల అవుతుంది? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన వాయిదాలు హోలీ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో 22వ విడత విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. పీఎం కిసాన్ యోజన పథకం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఎవరి వాయిదాలు నిలిచిపోతాయి? :
అనర్హులు అయినప్పటికీ ఈ పథకానికి తప్పుగా లింక్ చేసిన రైతులు.
ఇ-కేవైసీ చేయని రైతులు.
భూమి ధృవీకరణ పని పూర్తి కాని రైతులు.
ఆధార్ లింక్ చేయని రైతులు.
ఇ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి? :
- ఇ-కేవైసీ పూర్తి చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.
- ఆన్‌లైన్‌లో మీరు పథకం అధికారిక వెబ్‌సైట్ నుంచి ఇ-కేవైసీ చేయవచ్చు.
- మీరు అధికారిక వెబ్‌సైట్ (Pmkisan.gov.in)ని విజిట్ చేసి OTP ఆధారిత ఇ-కేవైసీని పూర్తి చేయొచ్చు.
e-KYC ఆఫ్‌లైన్‌లో కూడా చేయవచ్చా? :
- మీరు ఆఫ్‌లైన్‌లో కూడా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
- ఇందుకోసం మీ సమీపంలోని CSC కేంద్రాన్ని విజిట్ చేయాలి.
- మీరు బయోమెట్రిక్ ఆధారిత e-KYC పూర్తి చేసుకోవచ్చు.
