UK AI hardware Plan : చైనా, అమెరికాకు పోటీగా AI రేసులో బ్రిటన్ స్పీడ్ గేర్.. వేల కోట్లతో సూపర్ కంప్యూటర్, సొంత చిప్‌ల ప్లాన్!
UK AI hardware Plan : ఏఐ రేసులో తానేమి తక్కువకాదంటోంది బ్రిటన్. అమెరికా, చైనా దేశాలకు దీటుగా తాను కూడా సొంత సూపర్ కంప్యూటర్ నిర్మాణానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిప్ ల కోసం వేల కోట్లు ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
UK AI hardware Plan
- ఏఐ రేసులో అమెరికా, చైనాకు పోటీగా బ్రిటన్ రంగంలోకి
- ఏఐ సూపర్ కంప్యూటర్ తయారీ కోసం భారీగా పెట్టుబడులు
- 1.47 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబి ప్రణాళిక ప్రకటన
UK AI hardware Plan : ప్రపంచవ్యాప్తంగా ఏఐ యుద్ధం కొనసాగుతోంది. ఈ ఏఐ రేసులో తమ సత్తా చాటేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఏఐ రంగంలో అగ్రరాజ్యం అమెరికా, చైనా వంటి దేశాలు సొంత టెక్నాలజీతో వేగంగా దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాలతో పాటు బ్రిటన్ కూడా టాప్ రేసులో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది.
1.47 బిలియన్ డాలర్ల పెట్టుబడి :
ప్రపంచ ఏఐ పోరులో వెనుకబడకూడదనే లక్ష్యంతో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ కంప్యూటింగ్ శక్తిని పెంచుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఏకంగా 1.1 బిలియన్ పౌండ్ల (సుమారు 1.47 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇందులో కొత్త నేషనల్ ఏఐ సూపర్ కంప్యూటర్ ఏర్పాటు, స్వదేశీ ఏఐ చిప్ తయారీ సంస్థలకు ఆర్థిక సాయం వంటివి ఉన్నాయి.
ఏఐ అభివృద్ధికి పవర్ కంప్యూటింగ్ అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐ మోడళ్లను రూపొందించేందుకు వేలాది స్పెషల్ చిప్‌లు, భారీ డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం అవసరం. ఈ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా బ్రిటన్ సొంత సార్వభౌమ ఏఐ సామర్థ్యాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించింది.
ఈ ప్రణాళికలో భాగంగా 750 మిలియన్ పౌండ్లతో నేషనల్ ఏఐ సూపర్ కంప్యూటర్ను నిర్మించనున్నారు. 2030 నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఈ సూపర్ కంప్యూటర్లో ప్రస్తుత అడ్వాన్స్ ప్రాసెసర్లతో ఫ్యూచర్ జనరేషన్ ఏఐ చిప్‌లను కూడా వాడనున్నారు. ఇందులో భాగంగా స్పెషల్ ఏఐ చిప్‌ల కొనుగోలుకు 400 మిలియన్ పౌండ్లు కేటాయించారు.
భారీ పెట్టుబడుల దిశగా బ్రిటన్ :
కేవలం ఫారెన్ టెక్నాలజీపై డిఫెండ్ కాకుండా బ్రిటన్‌లోనే ఏఐ హార్డ్‌వేర్ ఇండస్ట్రీని పెంచేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరో అడుగు వేసింది. అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ ప్లేగ్రౌండ్ గ్లోబల్ నేతృత్వంలోని ఫండ్ ద్వారా బ్రిటన్ ఏఐ చిప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టనుంది. దీనికి బ్రిటిష్ బిజినెస్ బ్యాంక్ 150 మిలియన్ పౌండ్ల వరకు ఇవ్వనుంది.
ఇదిలా ఉండగా, కొత్త ఏఐ చిప్ డిజైన్, టెస్టింగ్స్, డెవలప్ కోసం బ్రిటిష్ కంపెనీలకు 120 మిలియన్ పౌండ్ల స్పెషల్ ప్రొగ్రామ్ ప్రారంభమైంది. ఏఐ రంగంలో నైపుణ్యం కలిగిన వారిని ఇందులో నియమించుకునేందుకు అదనంగా 45 మిలియన్ పౌండ్లు కేటాయించింది.
మొత్తంగా పరిశీలిస్తే.. బ్రిటన్ నిర్ణయం జస్ట్ ఒక సూపర్ కంప్యూటర్ తయారు చేయడం కాదు.. భవిష్యత్తులో ఏఐ పవర్ ఎవరి కంట్రోల్లో ఉండాలో డిసైడ్ చేసే ప్లేసులో ఉండాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. టెక్ రేసులో తన స్థానాన్ని బలపర్చుకునేందుకు ఇదో స్ట్రాటజీగా చెప్పొచ్చు. ఏఐ యుగంలో డేటా ఎంత ముఖ్యమో, ప్రాసెస్ చేసే చిప్‌లు, కంప్యూటింగ్ పవర్ కూడా అంతే కీలకమని బ్రిటన్ భావిస్తోంది.
