Gold Silver Rates Today : అదిరిపోయే శుభవార్త.. మరోసారి కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి అదిరిపోయే శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి అదిరిపోయే శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర వరుసగా మూడోరోజు తగ్గింది.

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.770 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.700 తగ్గింది. దీంతో గత మూడు రోజుల్లో తులం బంగారంపై సుమారు రూ.2,300 తగ్గుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు బంగారంపై 20 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,124 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధర భారీగా తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది. దీంతో గత మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,490 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,450 వద్దకు చేరిం

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,640 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,600 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,490కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
