PM Kisan 22nd Installment
PM Kisan 22nd Installment Date 2026 : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు కూడా పీఎం కిసాన్ లబ్ధిదారు రైతులు అయితే మీకు అతి త్వరలో రూ. 2వేలు మీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ కానున్నాయి.
గత సంవత్సరాలను పరిశీలిస్తే.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2026 చివరి వారంలో ఈ వాయిదా డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. గత ట్రెండ్ బట్టి పరిశీలిస్తే.. పీఎం కిసాన్ 22వ వాయిదా డబ్బులు అతి త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
పీఎం కిసాన్ లబ్ధిదారు జాబితాలో మీరు పేరు ఉందా? 22వ విడత డబ్బులు ఏ తేదీన పడతాయి? ఎలా చెక్ చేయాలి? మీకు రావాల్సిన రూ. 2వేలు నిలిచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పీఎం కిసాన్ 22వ విడత విడుదల తేదీ (అంచనా) :
ప్రతి విడత సమయంలో కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఒక నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారమే రూ. 2వేలు విడుదల చేస్తుంది. ఫిబ్రవరి వాయిదాల హిస్టరీని పరిశీలిస్తే ఒక అంచనాకు రావచ్చు.
దీని ప్రకారం.. 22వ విడత ఫిబ్రవరి 2026 చివరి నాటికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డిపాజిట్ అవుతుందని భావిస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా మీ రూ. 2వేలు సకాలంలో అందుకోవాలంటే ఈలోగా అన్ని పనులు పూర్తి చేసి ఉండాలి. లేదంటే మీ పేమెంట్ నిలిచిపోతుంది.
ఆధార్ లింకింగ్ : మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంటుకు లింక్ చేసి ఉండాలి.
e-KYC/మీ స్టేటస్ తెలుసుకోండి : మీ e-KYCని పూర్తి చేయాలి. అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో చెక్ చేయవచ్చు.
Note : రైతులు తమ బెనిఫిషియరి స్టేటస్ సులభంగా చెక్ చేసేందుకు కిసాన్ ఇమిత్రా చాట్‌బాట్ కూడా ఉపయోగించవచ్చు. ప్రతి విడతకు ముందు ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను అప్‌డేట్ చేస్తుంది. అందుకే మీ వివరాలను లేటెస్ట్ అప్‌డేట్ చేసుకోవడం బెటర్.
జాబితాలో మీ పేరు ఎలా చెక్ చేయాలి? :
మీరు 22వ విడతకు అర్హులో కాదో ఇలా తెలుసుకోండి
మిస్డ్ కాల్‌తో మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి :