PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ 22వ విడత రూ. 2 వేలు ఇంకా రాలేదా? మీ ఖాతాలో పడాలంటే వెంటనే ఇలా చేయండి!
PM Kisan 22nd instalment : పీఎం నరేంద్ర మోదీ అస్సాంలోని గువహటిలో పీఎం కిసాన్ పథకం 22వ విడత విడుదల చేశారు. తద్వారా దాదాపు 9 కోట్ల మంది రైతులకు బదిలీ చేశారు. లబ్ధిదారులు అధికారిక జాబితాలో పేర్లను ఇలా చెక్ చేయొచ్చు?
- Sreehari A
- Published On : March 14, 2026 / 04:36 PM IST
PM Kisan 22nd instalment ( Image Credit : AI Gemini )
PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. మీ బ్యాంకు ఖాతాలో ఇంకా 22వ విడత డబ్బులు రూ. 2వేలు ఇంకా పడలేదా? ఇంతకీ మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకున్నారా? అయితే, ముందు ఈ పని పూర్తి చేయండి.
మీ లబ్ధిదారుడి స్టేటస్ చెక్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 13, 2026 శుక్రవారం అస్సాంలోని గువహటిలో అర్హత కలిగిన లబ్ధిదారులకు పీఎం కిసాన్ 22వ విడతను విడుదల చేశారు. దాదాపు రూ.18,640 కోట్లను 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేశారు.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :
పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా మీ పేరు పీఎం కిసాన్ పథకం అధికారిక లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి.
- అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ (https://pmkisan.gov.in/)కు విజిట్ చేయండి.
- ‘Farmers Corner’ని యాక్సెస్ చేయండి. మీ హోమ్‌పేజీలో ‘Farmers Corner’ సెక్షన్ ఎంచుకోండి.
- ‘Beneficiary List’ ఎంచుకోండి. మెనులోని ‘Beneficiary List‘ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకుని ‘Get Report’పై క్లిక్ చేయండి.
- పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులందరి పేర్లను చూడవచ్చు.
22వ వాయిదా అందలేదా? కారణాలివే :
- పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి మినహాయించిన కొన్ని అనుమానిత కేసులను ప్రభుత్వం గుర్తించింది.
- ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి యాజమాన్యాన్ని పొందిన రైతులు.
- కుటుంబ సభ్యులు ఒకరి కన్నా ఎక్కువ మంది ప్రయోజనాలు పొందడం
- వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు ఇలాంటి కేసులకు తాత్కాలికంగా డబ్బులు నిలిచిపోతాయి
పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలి ? :
ఈ పథకంలో రైతులు స్పెషల్ పోర్టల్ (pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
‘Farmers Corner’ సెక్షన్ కింద పీఎం కిసాన్ పథకం నుంచి ప్రయోజనాలను పొందుతున్న వారు ‘Know Your Status’ ఫీచర్ ద్వారా స్టేటస్ ఈజీగా చెక్ చేయవచ్చు.
- పీఎం కిసాన్ కోసం eKYC ఎలా చేయాలి? :
- పీఎం కిసాన్ రిజిస్టర్ చేసుకున్న రైతులకు eKYC తప్పనిసరి.
- OTP-ఆధారిత eKYC పీఎం కిసాన్ పోర్టల్‌లో ఉంది.
- బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లొచ్చు.
పీఎం కిసాన్ లబ్ధిదారులకు 3 రకాల eKYC ఆప్షన్లు
(i) OTP-ఆధారిత e-KYC
(ii) బయోమెట్రిక్ ఆధారిత e-KYC కామన్ సర్వీస్ సెంటర్లు, రాష్ట్ర సేవా కేంద్రాలు (SSK)లు
(iii) కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఆధారిత e-KYC ప్రక్రియ
రైతులు పీఎం కిసాన్ పథకం కోసం వారి అర్హత ఎలా చెక్ చేయాలి? :
రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా (Kisan eMitra) చాట్‌బాట్ ద్వారా ‘Know Your Status (KYS)’ ఫీచర్ ద్వారా అర్హత, పేమెంట్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
ఇళ్లలోనే ఈ-కెవైసీ పూర్తి చేయగలరా? :
పీఎం కిసాన్ పోర్టల్ ఇప్పుడు ‘Know Your Status’ ద్వారా స్టేటస్ అందిస్తుంది. లబ్ధిదారులు అర్హత, ల్యాండ్ సీడింగ్, ఆధార్ కనెక్షన్, e-KYC స్టేటస్, పేమెంట్ స్టేటస్ ఒకే చోట చెక్ చేయవచ్చు.
