×
Ad

PM-KISAN 22nd instalment : పీఎం కిసాన్‌ 22వ విడతపై బిగ్ అప్‌డేట్.. రూ. 2వేలు పడేది వీరికే.. లిస్టులో మీ పేరు ఉందా? చెక్ చేసుకోండి!

PM-KISAN 22nd instalment : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడతపై ఉత్కంఠ నెలకొంది. హోలీకి ముందే రూ. 2వేలు పడతాయా? లేదా అనేదానిపై అధికారిక సమాచారం లేదు. మీరు అర్హులేనా కాదో ఇప్పుడే ఇలా చెక్ చేసుకోండి.

  • Published On : February 21, 2026 / 12:03 PM IST

PM-KISAN 22nd instalment

  • పీఎం కిసాన్ 22వ విడత విడుదల తేదీ ఎప్పుడంటే?
  • హోలీకి ముందే రూ. 2వేలు బ్యాంకు అకౌంట్లలో పడతాయా?
  • పీఎం కిసాన్ 22 విడత పొందాలంటే లిస్టులో మీరు ఉండాలి

PM-KISAN 22nd instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ, హోలీకి ముందు రూ. 2వేలు బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అవుతుందా? లేదా అనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 22వ విడత డబ్బులు పడే తేదీపై కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే, చాలామంది లబ్ధిదారు రైతులు అధికారిక పోర్టల్‌లో తమ పేర్లను చెక్ చేయవచ్చు. ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఈలోగా పీఎం కిసాన్‌కు సంబంధించి అవసరమైన అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి. లేదంటే రావాల్సిన విడత డబ్బులు కూడా ఆగిపోతాయి. కేంద్ర పథకం కింద అర్హత పొందిన రైతులు సంవత్సరానికి రూ. 6,000 అందుకుంటారు.

Read Also : Apple iPhone 15 : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఐఫోన్ లవర్స్ కొనాల్సిన ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 25వేలు తగ్గింపు..!

ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సిస్టమ్ ద్వారా వారి బ్యాంకు అకౌంట్లో నేరుగా డిపాజిట్ అవుతాయి. రాబోయే 22వ విడత పొందాలంటే రైతులు ఏయే అర్హతలు ఉండాలి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పీఎం కిసాన్ లబ్ధిదారుల అర్హతలివే :
పీఎం కిసాన్ లబ్ధిదారుల పేర్లలో సాగు భూమి, చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే అందుబాటులో ఉంది. భూమి రికార్డులు లబ్ధిదారుల గుర్తింపుకు ఆధారం. అయితే, సంస్థాగత భూస్వాములు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధిక పెన్షన్ పొందేవారు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు వంటి నిపుణులు అనర్హులు. సాగు వ్యవసాయ భూమి లేని వ్యక్తులు కూడా అర్హులు కారు. డాక్యుమెంట్లు కూడా సరిగా ఉండాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.

  • బ్యాంకు అకౌంటుకు ఆధార్ లింక్ అయి ఉండాలి.
  • e-KYC అప్‌డేట్ తప్పనిసరి
  • బ్యాంకు అకౌంట్ వివరాలు కచ్చితంగా ఉండాలి.
  • భూమి రికార్డులు సరిగ్గా అప్‌డేట్ చేయాలి.
  • ఆధార్ సీడింగ్ పూర్తి కాకపోయినా లేదా ఈ-కెవైసీ పెండింగ్‌లో ఉన్నా రూ. 2వేలు పడవు.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :

  • రైతులు తమ స్టేటస్ ఆన్‌లైన్‌లో వెరిఫై చేయొచ్చు.
  • అధికారిక PM-KISAN పోర్టల్ (pmkisan.gov.in)లో విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో ‘Beneficiary List’ఆప్షన్ క్లిక్ చేయండి.
  • రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోవాలి.
  • ‘Get Report’ పై క్లిక్ చేయండి.
  • ఈ పోర్టల్‌లో గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను చూడొచ్చు.
  • రైతులు రాబోయే 22వ వాయిదాకు అర్హులో కాదో కూడా తెలుసుకోవచ్చు.