PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ 22వ విడత రిలీజ్ డేట్ ఫిక్స్? హోలీకి ముందే రైతుల ఖాతాల్లో రూ. 2వేలు?
PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ 22వ విడత రూ. 2,000 ఎప్పుడు జమవుతుంది? హోలీకి ముందు రైతుల ఖాతాల్లో పడుతాయా లేదా తర్వాతా? రిలీజ్ డేట్, ఎలిజిబిలిటీ, స్టేటస్ చెక్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- Sreehari A
- Published On : February 28, 2026 / 03:58 PM IST
PM Kisan 22nd Installment ( Image Created by Gemini AI )
- 22వ విడత రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్‌డేట్
- ఎవరికెవరికీ రూ. 2,000 అందుతాయి? అర్హతలేంటి?
- పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- e-KYC పూర్తి చేయకపోతే ఏమవుతుంది?
- ఖాతాలో డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
PM Kisan 22nd Installment: కోట్లాది మంది పీఎం కిసాన్ రైతులకు అలర్ట్. అతి త్వరలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల కానుంది. చాలామంది రైతులు పీఎం కిసాన్ ద్వారా అందించే ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 6,000 జమ చేస్తుంది.
ఈ మొత్తాన్ని 3 విడతలుగా రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఇప్పటివరకు 21 విడతలు విడుదల అయ్యాయి. ఇప్పుడు, రైతులు 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. 22వ విడత ఫిబ్రవరిలో వస్తుందని భావించారు. అయితే, ఈ నెల దాదాపు ముగిసింది. అయినప్పటికీ విడత విడుదలపై ఎలాంటి ప్రకటన రాలేదు. హోలీకి ముందు వస్తుందా లేదా ప్రభుత్వం పండుగ తర్వాత 22వ విడత విడుదల ప్రకటిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.
మార్చిలో హోలీకి ముందే 22వ వాయిదా వస్తుందా? :
22వ విడతకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. వచ్చే మార్చిలో హోలీకి ముందు రూ. 2వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయా? లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రతి పీఎం కిసాన్ విడత దాదాపు ప్రతి 4 నెలలకు విడుదల అవుతుంది. ఈ ఫిబ్రవరిలోనే రూ. 2వేలు జమ అవుతాయని అంచనా వేయగా ఇంకా విడుదల చేయలేదు.
పీఎం కిసాన్ రైతుల్లో ఒకే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం పండుగకు ముందు 22వ విడత విడుదల చేస్తుందా? లేదా హోలీ తర్వాత తేదీని ప్రకటిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతానికి 22వ విడత విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. హోలీకి ముందే 22 వ వాయిదా రావచ్చని అందరూ భావిస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే విడత విడుదల అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
అర్హత గల రైతులకే రూ. 2వేలు :
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి అర్హత పొందిన రైతులకే వాయిదా డబ్బులు అందుతాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇందులో లబ్ధిదారులుగా ఉన్నారు. అన్ని వివరాలు కచ్చితంగా ఉంటే వాయిదా డబ్బులను పొందవచ్చు. గత 21వ విడతలో 9 కోట్లకు పైగా అర్హత కలిగిన రైతులకు ప్రయోజనం పొందారు. రాబోయే 22వ విడతలో రూ. 2వేలు నేరుగా కోట్లాది మంది రైతుల ఖాతాలకు అందనున్నాయి.
ఇ-కేవైసీ, ఆధార్ లింకింగ్, ల్యాండ్ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసిన రైతులు వాయిదాలను పొందడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. లబ్ధిదారులు తమ సమాచారాన్ని సకాలంలో అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. తద్వారా వాయిదా విడుదలైన వెంటనే మొత్తాన్ని తమ ఖాతాలకు నేరుగా డిపాజిట్ చేయవచ్చు.
ఈ పనులు వెంటనే పూర్తి చేయండి :
మీ కేవైసీ పెండింగ్‌లో ఉన్నా లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ చేయకపోయినా వెంటనే అప్‌డేట్ చేయండి. చిన్న టెక్నికల్ లోపం కూడా మీ వాయిదా ఆలస్యం నిలిచిపోవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. పీఎం కిసాన్ 22వ వాయిదా త్వరలో విడుదల కావచ్చు. అయితే, అధికారిక తేదీ ప్రకటించేవరకు వేచి ఉండాలి.
