PM Kisan 23rd Installment : బిగ్ షాక్.. పీఎం కిసాన్ 23వ విడతపై కేంద్రం కీలక ప్రకటన.. ఈ రైతులకు రూ. 2వేలు పడవు!
PM Kisan 23rd Installment : రాబోయే పీఎం కిసాన్ యోజన 23వ విడతకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ రైతులను ఇప్పుడు కొత్త లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నారు. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Updated on- May 23, 2026 / 04:46 PM IST
PM Kisan 23rd Installment ( Image Credit : AI )
- పీఎం కిసాన్ రైతులకు కేంద్రం బిగ్ షాక్ఈ
- రైతులకు పీఎం కిసాన్ 23వ వాయిదా అందదు
- అనర్హులైన రైతులను గురించి వారి పేర్లు తొలగింపు
- ఇకేవైసీ పూర్తి చేయని రైతులకు ఈసారి వాయిదా డబ్బులు రావు
PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ షాకింగ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మోదీ ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది లబ్ధిదారులలో కలకలం రేపింది.
మీరు కూడా ఈ పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత కోసం ఎదురుచూస్తుంటే ఇది మీకోసమే.. రాబోయే 23వ విడతను (PM Kisan 23rd Installment) రైతులందరి ఖాతాల్లో జమ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం కొన్ని నిబంధనలను కఠినతరం చేసింది.
ఈ ప్రభుత్వ పథకంలో అర్హులైన రైతులకు మాత్రమే ప్రత్యక్ష ప్రయోజనాలు అందనున్నాయి. అవసరమైన పత్రాలు లేకుండా తప్పుడు సమాచారంతో పీఎం కిసాన్ వాయిదాలు పొందుతున్న చాలా మంది రైతులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త నిర్ణయం వల్ల ఏ రైతులు ప్రభావితమవుతారో ఏ పొరపాట్ల వల్ల మీ వాయిదా పూర్తిగా నిలిచిపోవచ్చో అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇ-కేవైసీ పూర్తి చేయని వారి పేర్లు తొలగింపు :
పీఎం కిసాన్ 23వ వాయిదాను పొందాలంటే ఈసారి లబ్ధిదారు రైతులు తమ ఖాతాలకు సంబంధించి ఇ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా పూర్తి చేయని రైతులు ఉంటే 23వ విడతను పూర్తిగా కోల్పోతారు.
Read Also : Maruti Car Prices : మిడిల్ క్లాస్‌కు మళ్లీ దెబ్బ.. జూన్ 1 నుంచి మారుతి కార్లు కొనడం కష్టమే..
ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ మోసాలు, అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వ రికార్డులతో వ్యవసాయ భూమి సరిపోలుతుందో లేదో కూడా చెక్ చేసుకోండి.
మీ భూమి పత్రాలు మీ పీఎం కిసాన్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. లేదంటే.. లబ్ధిదారుల కొత్త జాబితా నుంచి మీ పేరును తక్షణమే తొలగిస్తారు. చాలా మంది రైతులు ఈ రెండు ముఖ్యమైన పనులను పట్టించుకోవడం లేదు. ఈ కొత్త అప్‌డేట్‌తో కఠినమైన నిబంధనలను సడలించబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
అర్హత లేని రైతులపై నిఘా :
ఈ పథకం కారణంగా నష్టపోయిన వారిలో భారీ సంఖ్యలో రైతులు ఉన్నారు. వాస్తవానికి వీరంతా ఈ పథకం పరిధిలోకి రారు. ప్రభుత్వ కొత్త నిబంధన ప్రకారం.. కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా లేదా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసినా వారు ఈ పథకానికి పూర్తిగా అనర్హులు.
నకిలీ రైతులపై ప్రభుత్వం కఠిన చర్యలు :
మోసపూరితంగా లేదా నకిలీ పత్రాలతో వాయిదాలు పొందిన వ్యక్తులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇలాంటి వ్యక్తులను పీఎం కిసాన్ 23వ వాయిదా నుంచి మినహాయించడమే కాదు.. వారి నుంచి గత వాయిదాలను కూడా తిరిగి వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే, మీ పీఎం కిసాన్ వాయిదాను పొందాలనుకుంటే వెంటనే మీ స్టేటస్ చెక్ చేసుకోండి.
