PM Kisan 23rd Installment: రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ.2వేలు పడేది ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్!
PM Kisan 23rd Installment : లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ 23వ విడత కోసం చూస్తున్నారు. అర్హులైన రైతులకు ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం అందుతుంది. ఈసారి 23వ వాయిదా ఎప్పుడు వస్తుందంటే?
- Sreehari A
- Updated on- June 2, 2026 / 02:15 PM IST
PM Kisan 23rd instalment
- పీఎం కిసాన్ 23వ వాయిదా పడేది ఎప్పుడో తెలుసా?
- అర్హులైన రైతులకు రూ. 6వేలు ఆర్థిక సాయం
- ఈసారి 23వ వాయిదా పడే తేదీపై ఉత్కంఠ
PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
పీఎం నరేంద్ర మోదీ 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతిలో 22వ వాయిదా డబ్బులను విడుదల చేశారు. ఈ సందర్భంగా 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ అయ్యాయి. ఇప్పుడు రైతులు 23వ విడత విడుదల చేయాల్సి ఉంది.
23వ విడత ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ యోజన కింద ప్రతి 4 నెలలకు విడత విడుదల అవుతుంది. 22వ విడత 2026 మార్చిలో (PM Kisan 23rd instalment) విడుదల కాగా రాబోయే 23వ విడత జూలైలో వస్తుందని భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఇంకా దీనిపై అధికారిక తేదీని ప్రకటించలేదు.
పీఎం కిసాన్ యోజన ఏంటి? :
2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా రూ. 6వేలు అందుతుంది. ఈ మొత్తాన్ని డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా ఒక్కొక్కటి రూ. 2వేలు చొప్పున 3 విడతలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది.
23వ వాయిదా కోసం ఇ-కేవైసీ అవసరం :
పీఎం కిసాన్ 23వ విడత పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసిని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ చేసుకున్న రైతులందరికీ ఇ-కేవైసి తప్పనిసరి. అధికారిక పోర్టల్‌లో ఓటీపీ ద్వారా లేదా సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ఇ-కేవైసీని పూర్తి చేయొచ్చు.
పీఎం కిసాన్ బెనిఫిట్స్ ఎవరికి వర్తిస్తాయంటే?
- దరఖాస్తుదారు భారత పౌరుడై ఉండాలి.
- సాగు భూమి తప్పక ఉండాలి.
- చిన్న లేదా సన్నకారు రైతులు
- నెలకు రూ. 10వేలు లేదా ఎక్కువ పెన్షన్ పొందడం, రిటైర్మెంట్ అయిన వ్యక్తులు అర్హులు కారు.
- టాక్స్ చెల్లించేవారు కూడా ఈ పథకం బెనిఫిట్స్ పొందలేరు.
- సంస్థాగత భూ యజమానులకు కూడా వర్తించదు.
మీ లబ్ధిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- మీ స్టేటస్ (Know Your Status) ఆప్షన్ క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి.
- (Get Data)పై క్లిక్ చేయండి.
- మీ లబ్ధిదారుని స్టేటస్ స్క్రీన్‌పై చూడొచ్చు
కొత్త రైతులు ఇలా అప్లయ్ చేసుకోవాలి :
ఇప్పటివరకూ పీఎం కిసాన్ పథకంలో చేరని రైతులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయొచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ విజిట్ చేసి (New Farmer Registration) అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి అవసరమైన వివరాలను నింపాలి. ఆపై అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
మీ అప్లికేషన్ పూర్తి చేశాక ప్రింటౌట్ తీసి పెట్టుకోండి. పీఎం కిసాన్ డబ్బులు రాకుంటే లబ్ధిదారు రైతులు ఎవరైనా 155261 లేదా 011-24300606 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
