×
Ad

PM Kisan Yojana : పీఎం కిసాన్ 22వ విడతపై ఉత్కంఠ.. ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. మీరు అర్హులేనా? చెక్ చేసుకోండి!

PM Kisan Yojana : పీఎం కిసాన్ పథకం 22వ విడతపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈసారి రూ. 2వేలు పొందాలంటే రైతులు ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి.

PM Kisan 22nd Installment ( Image Credit to Original Source)

  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత విడుదల ఎప్పుడు?
  • ప్రతి ఏడాదిలో 3 సార్లు రూ. 2వేలు విడుదల చేస్తున్న కేంద్రం
  • ఫిబ్రవరి రెండో వారంలో లేదా ఆఖరిలో 22వ విడత విడుదల ఛాన్స్

PM Kisan Yojana 22nd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల కానుంది. లక్షలాది మంది లబ్ధిదారు రైతులు పీఎం కిసాన్ రూ. 2వేల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది కేంద్రం ఇంకా వెల్లడించలేదు.

పీఎం కిసాన్ పథకం ఏంటి? :
కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా దేశంలోని అనేక వర్గాలవారికి ప్రయోజనాలను అందిస్తుంది. ఉదాహరణకు.. మీరు రైతు అయితే దేశవ్యాప్తంగా వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుండగా, మరికొన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి.. ఇందులో ప్రస్తుతం లక్షలాది మంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు.

ప్రతి ఏటా 3 సార్లు రూ. 2వేలు :
ఈ పథకం కింద లబ్ధిదారులకు సంవత్సరానికి 3 సార్లు రూ. 2వేలు అందుకుంటారు. ఈ ఏడాదిలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ విడత ఎవరికి అందుతుంది? ఎవరు అందుకోరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఈ 2 ప్రీపెయిడ్ ప్లాన్లతో అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా.. నెలంతా ఫుల్ ఎంజాయ్..!

ఏ రైతులు 22వ విడత డబ్బు అందుకుంటారు? :
ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు వాయిదా చెల్లిస్తారు. అంతేకాదు.. e-KYC కూడా తప్పనిసరిగా పూర్తి చేయడం చాలా అవసరం. అదేవిధంగా, మీరు భూమి ధృవీకరణకు సంబంధించి పూర్తి చేయాలి. ఈ ముఖ్యమైన పనులను పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ 22వ వాయిదాను పొందలేరు.

22వ విడత ఎప్పుడు విడుదల చేయవచ్చు? :
ఈసారి ప్రధానమంత్రి కిసాన్ యోజన 22వ విడత విడుదల కానుంది. ఈ పథకం కింద మొత్తం 21 వాయిదాలు ఇప్పటివరకు విడుదలయ్యాయి. ఈ పథకం ప్రతి వాయిదా సుమారు 4 నెలల వ్యవధిలో విడుదల అవుతుంది.

దీని ప్రకారం.. 22వ విడత 4 నెలల్లో ఫిబ్రవరిలో పూర్తవుతోంది. అందుకే 22వ విడత ఫిబ్రవరి నెలలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. 22వ విడత విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పీఎం కిసాన్ డబ్బును ఎవరు జారీ చేస్తారు? :
పీఎం కిసాన్ యోజన కింద అందుకున్న వాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రధానమంత్రి స్వయంగా ఈ విడతను విడుదల చేస్తారు. ఆపై లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.