PNB Customers : పంజాబ్ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అర్జెంట్‌గా ఇలా చేయకుంటే మీ అకౌంట్ క్లోజ్ అయినట్టే..!
PNB Customers : పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లు మీ బ్యాంకు ఖాతాలు ఇన్ యాక్టివ్ అయ్యాయా? ఏప్రిల్ 16లోగా అకౌంట్లకు కేవైసీని చేయించుకోండి. లేదంటే మీ అకౌంట్ పూర్తిగా కోల్పోతారు.
- Sreehari A
- Published On : March 18, 2026 / 05:20 PM IST
PNB Customers
- పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్ న్యూస్
- ఏప్రిల్ 16 లోపు బ్యాంకు ఖాతాలకు కేవైసీ తప్పనిసరి
- వరుసగా 2 ఏళ్ల పాటు అకౌంట్ ఇన్ యాక్టివ్ అయితే క్లోజ్ అవుతుంది
PNB Customers : పంజాబ్ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్ల కోసం అలర్ట్ జారీ చేసింది. చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు ఇన్ యాక్టివ్ అయితే వీలైనంత త్వరగా కేవైసీతో అప్‌డేట్ చేసుకోవాలని బ్యాంక్ సూచించింది. ఒకవేళ వినియోగదారులు ఏప్రిల్ 15, 2026 లోగా తమ కేవైసీని పూర్తి చేయకపోతే ఏప్రిల్ 16, 2026 తర్వాత ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా బ్యాంక్ ఈ అకౌంట్లను క్లోజ్ చేస్తుంది.
పంజాబ్ బ్యాంకు నిబంధనలేంటి? :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ఒక వినియోగదారుడు వరుసగా 2 ఏళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరపకపోతే, ఆ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ ఇన్ యాక్టివ్ అవుతుంది. భద్రతా ప్రయోజనాల కోసం ఈ అకౌంట్లను మానిటరింగ్ చేస్తారు.
మోసాలు లేదా దుర్వినియోగాన్ని నివారించేందుకు క్రమం తప్పకుండా కేవైసీ అప్‌డేట్ చేయాలి. మీ అకౌంట్ ఇన్ యాక్టివ్ అయితే తిరిగి యాక్టివ్ చేయడం ఇప్పుడు గతంలో కన్నా చాలా ఈజీ. వినియోగదారులు హోమ్ బ్రాంచ్ లేదా ఏదైనా ఇతర బ్రాంచ్‌ను విజిట్ చేయడం ద్వారా తమ కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా, అనేక బ్యాంకులు ఇప్పుడు V-CIP (వీడియో KYC) వంటి డిజిటల్ ఆప్షన్లను అందిస్తున్నాయి. తద్వారా మీ ఇంటి నుంచే సౌకర్యవంతంగా కేవైసీని పూర్తి చేయవచ్చు. అయితే, బ్యాంక్ కేవైసీ అవసరాలను పూర్తిగా ధృవీకరించిన తర్వాత మాత్రమే అకౌంట్ తిరిగి యాక్టివేట్ అవుతుంది.
Read Also : EPF Pension : నెలవారీ రూ. 1000తో బతకడం కష్టం.. పెన్షనర్లకు తక్షణమే ఈపీఎఫ్ పెన్షన్ పెంచాలి!
అకౌంట్ ఎలా యాక్టివేట్ చేయాలి? :
మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వాలంటే కొన్ని తప్పనిసరి లావాదేవీలను చేయాలి. ఇందులో డబ్బు డిపాజిట్ లేదా విత్ డ్రా చేయడం వంటివి చేయాలి. బ్యాలెన్స్ చెక్ చేయడం, చెక్‌బుక్ లేదా కార్డును రిక్వెస్ట్ చేయడం లేదా ట్రాన్సాక్షన్ లిమిట్స్ అడ్జెస్ట్ చేయడం వంటి ఆర్థికేతర లావాదేవీలను కూడా చేయవచ్చు. అకౌంట్ సేఫ్టీ కోసం టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా చేయాలి.
మీ హోమ్ బ్రాంచ్‌లో మీ అకౌంట్ యాక్టివేట్ చేయాలనుకుంటే.. కొత్త KYC డాక్యుమెంట్లతో పాటు రిక్వెస్ట డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. మీ ఆధార్ వెరిఫికేషన్ బయోమెట్రిక్‌గా పూర్తయినంత వరకు నాన్-హోమ్ బ్రాంచ్‌లో కూడా చేయవచ్చు. అప్పుడు బ్యాంకు అకౌంట్ వెరిఫై చేశాక తిరిగి యాక్టివేట్ అవుతుంది. తద్వారా మీరు యధావిధిగా లావాదేవీలు చేసుకోవచ్చు.
మొత్తం మీద, మీ PNB అకౌంట్ చాలా కాలంగా వాడకపోతే తేలికగా తీసుకోవద్దు. మీ కేవైసీని వెంటనే అప్‌డేట్ చేయండి. లేదంటే మీ ఖాతా క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేయడం కష్టం. అందుకే గడువు తేదీకి ముందే యాక్టివేట్ చేయడం బెటర్.
