Post Office PAN Rules : పోస్టాఫీస్ ఖాతాదారులకు కొత్త రూల్స్.. ఇకపై PAN ఎందుకు తప్పనిసరి..? TDS కోసం కొత్త ఫారం ఏంటి..?

Post Office PAN Rules : పోస్టాఫీసు నిబంధనలు మారాయి.. ప్రతి లావాదేవీకి పాన్ కార్డు తప్పనిసరి. 2026 టాక్స్ నిబంధనల ప్రకారం.. పోస్టాఫీసులో ఖాతాలకు పాన్ కార్డు ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Post Office PAN Rules

  • పోస్టాఫీస్‌లో పెద్ద మార్పులు.. చిన్న లావాదేవీ అయినా పాన్ ఇవ్వాల్సిందే
  • పోస్టాఫీస్ ఖాతాలపై ఐటీ డిపార్ట్‌మెంట్ నజర్.. పాన్ రూల్స్ పాటించాలి
  • పోస్టాఫీస్‌లో డబ్బు పెట్టేవారికి ముఖ్య గమనిక.. టీడీఎస్ కోసం కొత్త ఫారం
  • పాన్ లేకుండా పోస్టాఫీస్ సేవింగ్స్ చేయలేరు కొత్త గైడ్‌లైన్స్ అమలు

Post Office PAN Rules : పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ నిబంధనలు మారాయి. ఇకపై డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ కోసం పాన్ కార్డు తప్పనిసరి. అలాగే, టీడీఎస్ మినహాయింపు కోసం ఫారం 15G/H స్థానంలో కొత్త ఫారం 121ని ప్రవేశపెట్టారు. అయితే, ఈ కొత్త నిబంధనల కారణంగా మీ సేవింగ్స్‌పై ​​ప్రభావం పడుతుందా? లేదో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? పోస్ట్ ఆఫీసులో పెట్టుబడి పెట్టారా? ఇకపై పెట్టబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే (Post Office PAN Rules) కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీసుల కోసం ఆర్థిక నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థలో మాదిరిగానే పోస్ట్ ఆఫీసులో కూడా దాదాపు ప్రతి లావాదేవీకి ఇప్పుడు పాన్ కార్డ్ తప్పనిసరి.

అంతేకాదు.. పన్ను మినహాయింపుల కోసం అవసరమైన ఫారమ్‌లలో భారీగా మార్పులు చేశారు. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత తీసుకురావడం పన్ను ఎగవేతను అరికట్టేందుకు ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు.

పాన్ లేకుండా ఈ పనులు జరగవు :
ఇప్పుడు, మీరు పోస్టాఫీసులో కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలన్నా డబ్బు డిపాజిట్ చేయాలన్నా లేదా విత్‌డ్రా చేయాలన్నా, మీ పాన్ కార్డ్ నంబర్‌ను ఇవ్వక తప్పదు. టైమ్ డిపాజిట్లు, ఇతర సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టేందుకు కూడా ఇది తప్పనిసరి.

Read Also : Mother’s Day 2026 : మదర్స్ డే స్పెషల్.. అమ్మ మాటే మంత్రం.. ఆ ఒక్క అలవాటే మార్క్ జుకర్‌బర్గ్‌ను టెక్ కింగ్ చేసింది!

మీకు పాన్ కార్డ్ లేకపోతే మీరు ఫారం 97 నింపాల్సి ఉంటుంది. పాత ఫారం 60 స్థానంలో వచ్చింది. ఫారం 97లో మీ పేరు, అడ్రస్, లావాదేవీల గురించి పూర్తి వివరాలు అందించాలి. వెరిఫికేషన్ తర్వాత మాత్రమే మీ పనులు పూర్తవుతాయి.

కొత్త ఫారమ్‌కు ఇవి తప్పనిసరి :

  • డిపాజిటర్ పేరు, అడ్రస్ వివరాలు
  • లావాదేవీ విధానం
  • లావాదేవీ మొత్తం
  • ఐడెంటిటీ, అడ్రస్ డాక్యుమెంట్లు

టీడీఎస్ కోసం ఫారం 121 చాలు :
గతంలో, వివిధ వయసుల వారు టీడీఎస్ (TDS) కోసం ఫారం 15G, 15Hలను నింపాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ఫారాల స్థానంలో కొత్త ఫారం 121 వచ్చింది.

మీ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోయినా వడ్డీ పన్ను పడకుండా మీరు ఈ ఫారాన్ని ఫైల్ చేయవచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ మార్పులు చేశారు. అయితే, మీరు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ ఫారాలను మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది.

ఇన్వెస్టర్లపై ప్రభావం ఉంటుందా? :
ఈ కొత్త పాన్ కార్డు నిబంధనలతో ఆర్డీ, ఎంఐఎస్, లేదా టైమ్ డిపాజిట్ల వంటి పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ లపై వచ్చే వడ్డీని ఆదాయపు పన్ను శాఖ ఇకపై నేరుగా మానిటరింగ్ చేస్తుంది. ఇకపై చిన్న పెట్టుబడిదారులకు డాక్యుమెంట్ల పని కొద్దిగా పెరగవచ్చు.

తద్వారా పారదర్శకతను తీసుకురానుంది. ఇందుకోసం పోస్టాఫీస్ రికార్డులను కూడా 7 ఏళ్ల పాటు స్టోర్ చేస్తుంది. సిస్టమ్ పూర్తిగా అప్ డేట్ అయ్యే వరకు పాత ఫారమ్‌లను తీసుకుంటారు. కానీ, కొత్త సిస్టమ్ త్వరలోనే పూర్తిగా అమల్లోకి రానుంది.