Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇలా 5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా రూ.20,500 వడ్డీనే సంపాదించుకోవచ్చు!
Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. సీనియర్ సిటిజన్లు 5 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 20,500 వడ్డీ సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఈ పథకం బెనిఫిట్స్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- April 23, 2026 / 02:41 PM IST
Post Office Scheme
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) బెనిఫిట్స్ ఏంటి?
- 5 ఏళ్లు పెట్టుబడి పెడితే ఎంత మొత్తంలో రాబడి వస్తుందంటే?
- పోస్టాఫీసులో ప్రతినెలా రూ. 20,500 వడ్డీ పొందడం ఎలా?
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వ పథకంలో 5 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 20,500 వడ్డీనే సంపాదించుకోవచ్చు తెలుసా? ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా ఆదాయం అవసరం.
ఒకరిపై ఆధారపడకుండా ఉండాలంటే జీవించాలంటే చేతిలో డబ్బు ఉండాలి. వృద్ధుల (Post Office Scheme) అవసరాల కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు ప్రతి నెలా గరిష్టంగా రూ. 20,500 వడ్డీని పొందవచ్చు.
కనీస పెట్టుబడి రూ. 1,000 :
రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అద్భుతంగా ఉంటుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం రూ. 1,000తో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లించవచ్చు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేటు :
ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు త్రైమాసికానికి చిన్న సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ రేట్లు జనవరి–మార్చి 2026 కాలానికి ఉన్నట్లే కొనసాగుతాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లోని పెట్టుబడిదారులు మునుపటిలాగే 8.2శాతం వార్షిక వడ్డీ రేటును పొందవచ్చు.
ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి? :
SCSS అకౌంట్ కాలపరిమితి 5 ఏళ్లు. మెచ్యూరిటీ తర్వాత మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ తేదీ నుంచి పోస్టాఫీస్ సేవింగ్స్ రేటు ప్రకారం ఖాతాపై వడ్డీ లభిస్తుంది. ఖాతాను క్లోజ్ చేసేవరకు ఈ వడ్డీ కొనసాగుతుంది.
పథకం నియమాలివే :
అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఒకవేళ పెట్టుబడిదారుడు నిర్దేశించిన పరిమితి కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే అదనపు మొత్తం రీఫండ్ అవుతుంది. అయితే, ఈ అదనపు మొత్తంపై పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ప్రకారమే వడ్డీ లభిస్తుంది. సాధారణంగా ఈ వడ్డీ తక్కువగా ఉంటుంది.
ఈ పథకం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు అందుబాటులో ఉంది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్న వ్యక్తులు కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
రిటైర్మెంట్ అయిన రక్షణ శాఖ సిబ్బంది 50 ఏళ్ల వయస్సు నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. తద్వారా ఇద్దరూ బెనిఫిట్ పొందవచ్చు.
గరిష్ట పెట్టుబడి ఎంతంటే? :
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఖాతాను ఏ బ్యాంకులోనైనా లేదా పోస్ట్ ఆఫీసులోనైనా సులభంగా ఓపెన్ చేయొచ్చు. కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000, గరిష్ట మొత్తం రూ. 30 లక్షలు. డిపాజిట్లు తప్పనిసరిగా రూ. 1,000 గుణిజాలలో చేయాలి. ఈ పరిమితి మీ పెట్టుబడిని బట్టి పెంచుకోవాలి.
8.2 శాతం వడ్డీ :
ఈ పథకం ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తోంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఈ పథకంలో రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి సుమారుగా రూ. 2.46 లక్షల వడ్డీ రేటును పొందవచ్చు. నెలకు రూ. 20,500 కన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు.
