Price Hike August 2026 : సామాన్యులకు బిగ్ షాక్..! ఆగస్టులో టీ నుంచి టీవీ వరకు.. కారు నుంచి మొబైల్ వరకు.. అన్నీ ఖరీదే!
Price Hike August 2026 : పండగలకు ముందే సామాన్యలకు జేబుకు చిల్లుపడనుంది. ఆగస్టు నెలలో తాగే టీ దగ్గర నుంచి టీవీ, కారు నుంచి మొబైల్ ఫోన్ వరకు అన్ని ధరలు భారీగా పెరగనున్నాయి.
- Sreehari A
- Updated on- July 29, 2026 / 05:29 PM IST
Price Hike August 2026 ( Image Credit : AI )
- ఆగస్టులో జేబుకు చిల్లు.. భారీగా పెరగనున్న ధరలు
- టీ తాగాలన్నా ఖర్చే.. టీవీ కొనాలన్నా షాకే!
- ఆగస్టులో ధరల సునామీ.. ఏవి ఎంత పెరుగుతాయో తెలుసా?
Price Hike August 2026 : సామాన్యులకు బిగ్ షాక్ తగలనుంది. ఆగస్టు నెలలో జేబు మరింత భారంగా మారనుంది. పండగల సీజన్‌కు ముందే ధరల మోత మోగించేందుకు అన్ని ఇండస్ట్రీల కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి.
పశ్చిమాసియా సంక్షోభం, ముడి సరుకుల ధరల పెంపు, రవాణా వ్యయాల భారంతో వచ్చే ఆగస్టు నుంచి టీ పొడి నుంచి హెయిర్ ఆయిల్, దుస్తులు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కార్లు వంటి పలు ప్రొడక్టుల ధరలు 4 శాతం నుంచి 8 శాతం వరకు పెరగనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ధరల పెంపును ప్రకటించాయి. మరికొన్ని కంపెనలు కూడా అదే బాటలో వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఫిబ్రవరి చివరిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన దగ్గరనుంచి దేశీయ కంపెనీలు ఇప్పటికే రెండుసార్లు ధరలను పెంచాయి. ఇప్పుడు ఆగస్టులో 3వ విడత పెంపునకు రెడీ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువలో తీవ్ర హెచ్చుతగ్గులు, ముడి చమురు, ఇతర కమోడిటీల ధరల పెంపుతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. ఈ భారాన్ని పూర్తిగా భరించడం సాధ్యం కాదని, ధరల పెంపు అనివార్యమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పకనే చెప్పేశాయి.
భారీగా పెరగనున్న కార్ల ధరలు :
ఆగస్టు నుంచి కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. మారుతి సుజుకీ కారు మోడళ్లను బట్టి రూ.30 వేల వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతి కంపెనీ తమ కార్ల ధరలు పెంచడం ఇది సెకండ్ టైమ్..
Read Also : Swiggy-Zomato Boycott : స్విగ్గీ, జొమాటో బ్యాన్.. రెస్టారెంట్ల సంచలనం.. ఈ డేట్ నుంచి ఇక..!
మరోవైపు హోండా కూడా ఆగస్టు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెలలోనే ధరలు భారీగా పెంచేశాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా 4 శాతం వరకు ధరలు పెంచేసింది. డాలర్-రూపాయి మారకం రేటును బట్టి మరోసారి పెంపు తప్పదని సంకేతాలిచ్చింది.
ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై భారం :
హెయిర్ ఆయిల్, టీ వంటి నిత్యావసర వినియోగ వస్తువుల తయారీ కంపెనీలు కూడా ముడి పదార్థాల ధరల పెంపుతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పెట్రోలియం ఆధారిత ముడి పదార్థాలు, ఆవనూనె, బాదం నూనె వంటి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి వ్యయం మరింత భారంగా మారిందని కంపెనీలు చెబుతున్నమాట.
జూన్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ కన్స్యూమర్ కేర్, హెచ్‌యూఎల్ వంటి సంస్థలు కూడా సెప్టెంబరు త్రైమాసికంలో ధరలను భారీగా పెంచనున్నట్టు సంకేతాలిచ్చాయి. ఇప్పటికే 2 శాతం నుంచి 5 శాతం వరకు ధరలు పెంచిన హెచ్‌యూఎల్, పెరిగిన వ్యయాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మరోసారి ధరల పెంపు తప్పదని చెప్పేసింది.
టీవీలు, ఫ్రిజ్‌లు, ఫోన్ల ధరల పెంపు :
ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ధరల పెంపు తప్పదు. ఆగస్టులో టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు 4 శాతం నుంచి 6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. మెమొరీ చిప్‌ల కొరత, ధరలు గత కొన్ని నెలల్లో 3 రెట్లు పెరిగాయి. దాంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుస్తుల తయారీ కంపెనీలు సైతం పెరిగిన ఉత్పత్తి వ్యయంతో ధరల పెంపునకు రెడీ అవుతున్నాయి.
వినియోగదారులకు బిగ్ షాక్ :
పండగల సీజన్‌లో వినియోగదారులు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తుంటారు. ఈ ధరల పెంపు నేరుగా సామాన్యుల జేబుపై ప్రభావం పడనుంది. టీ పొడి నుంచి టీవీ వరకు మొబైల్ నుంచి కారు వరకు దాదాపు అన్ని విభాగాల్లో ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల సామాన్యులకు ఖర్చులతో మరింత భారంగా మారనుంది.
