చింతకాయ@ కేజీ రూ.1000

ఈసారి చింతకాయల కొరత ఏర్పడడంతో వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. కిలో చింతకాయల ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది.

  • Publish Date - September 3, 2019 / 03:22 AM IST

ఈసారి చింతకాయల కొరత ఏర్పడడంతో వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. కిలో చింతకాయల ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది.

‘అందని ద్రాక్ష పుల్లన’ అనే సామెతలా.. చింతకాయ కూడా సామాన్యుడికి అందనంత దూరంలో నిలిచింది. చింతకాయల ధరకు రెక్కలు వచ్చి వందలు దాటి వెయ్యి రూపాయలకు చేరుకుంది. చింతకాయ దిగుబడి తక్కువగా ఉండడంతో రైతుల మద్ధతు ధర ఎంత ఉన్నా.. వ్యాపారులు మాత్రం అమాంతం పెంచేశారు. 

కిలో చింతకాయల ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది. వినాయకచవితి పండుగ సందర్భంగా ఈ అవకాశాన్ని మరింత చక్కగా వాడుకున్నారు వ్యాపారస్థులు. ఆదివారం (సెప్టెంబర్1, 2019) సంగారెడ్డి జిల్లా జోగిపేట అంగట్లో కిలో చింత కాయల ధర రూ.1000 చొప్పున విక్రయించారు.

వినాయక చవితి పండుగకు తుమ్మికూరలో చింతకాయను వేసి వండడం ఆనవాయితీగా వస్తోంది. జోగిపేట పట్టణంలో రెండు, మూడు చోట్ల చింతకాయలను 50 గ్రాములు, 100 గ్రాముల చొప్పున అమ్ముతుండడంతో విక్రయదారుడితో ప్రజలు గొడవకు దిగారు. నారాయణఖేడ్, సంగారెడ్డి ప్రాంతాల్లో కిలో రూ.350, రూ.400, రూ.600 చొప్పున విక్రయించారని అంటున్నారు.

Also Read : అంతరిక్షంలో ఉండాల్సిన వ్యోమగామి భూమిపై ప్రత్యక్షం