Paytm Payments Bank : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ రద్దు.. డిపాజిట్ డబ్బులు తిరిగి ఇస్తారా?

Paytm Payments Bank Licence: పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. ఇప్పటికే ఈ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిన కస్టమర్లకు రీఫండ్ చేస్తామని పీపీబీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Rbi Cancels Paytm Payments Banks Licence

  • పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ
  • బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుల పరిస్థితి ఏంటి?
  • కస్టమర్లలో ఆందోళన, రీఫండ్ ప్రాసెస్ చేస్తామన్న ఆర్బీఐ

Paytm Payments Bank : మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వాడుతున్నారా? మీ డబ్బులు పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో ఉన్నాయా? అయితే, మీకో బిగ్ షాకింగ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసింది.

ఇప్పుడు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో జమ చేసిన డబ్బుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. అందరి (Paytm Payments Bank) డబ్బులు సురక్షితంగా ఉన్నాయని, వినియోగదారులకు డబ్బు రీఫండ్ ఇవ్వనున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఈ విషయమై ఆర్‌బీఐ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించనుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అధికారిక పోర్టల్‌లో డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని, అన్ని డిపాజిట్లను తిరిగి ఇవ్వడానికి తగినంత ఫండ్స్ ఉన్నాయంటూ ఒక బ్యానర్ కనిపిస్తుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డబ్బు రీఫండ్ ఎలా? :
చాలామంది పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేసి ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆ డబ్బు రీఫండ్ ఇస్తామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆర్‌బీఐ ప్రకటించాయి. కానీ, పేటీఎం పోర్టల్‌లో రీఫండ్ ప్రాసెస్ నోటీసులో ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.

Read Also : కొత్త AC కొంటున్నారా? 5 స్టార్ ఏసీ కావాలా? 3 స్టార్ ఏసీ కావాలా? పవర్ బిల్లు తగ్గాలంటే? ఏది కొంటే బెటర్?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు రద్దు :

ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంకు లైసెన్సును రద్దు చేసిన నేపథ్యంలో ఇకపై బ్యాంకుగా పనిచేయదు. కొత్త లావాదేవీలు చేయలేరు లేదా బ్యాంకింగ్ సేవలను కూడా అందించలేదు.

ఆర్‌బీఐ ఇలా ఎందుకు చేసింది?

బ్యాంకు కార్యకలాపాలు సరిగా లేకపోవడం, ఖాతాదారుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లడం, యాజమాన్యంపై నమ్మకం లేకపోవడం, నిబంధనలు, షరతులను పాటించకపోవడం వంటి కారణాల వల్ల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంది. 2022 వరకు కొత్త కస్టమర్ల చేరికను నిషేధించడంతో పాటు, 2024 వరకు ఖాతా డిపాజిట్లను కూడా నిలిపివేసింది. దీని ఫలితంగా, పేటీఎం ఫాస్టాగ్‌లు కూడా ప్రభావితమయ్యాయి.

పేటీఎం, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మధ్య తేడా ఏంటి?

పేటీఎం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ వేర్వేరు సంస్థలు. ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకుగా పనిచేయదు. అయితే, పేటీఎం యాప్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. పేటీఎం పేరెంట్ కంపెనీ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి సపరేట్ అయినట్టుగా ప్రకటనలో తెలిపింది.