RBI Repo Rate Hike : ఆర్బీఐ రెపో రేటు పెంపు.. మీ నెలవారి ఈఎంఐ ఎంత పెరగనుంది..? మారిపోనున్న బడ్జెట్..!
RBI Repo Rate Hike : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. దాదాపు మూడున్నరేళ్ల తరువాత (2023 ఫిబ్రవరి తరువాత) రెపో రేటును పెంచింది.
- Harish Thanniru
- Updated on- October 7, 2026 / 05:48 PM IST
RBI Repo Rate Hike
RBI Repo Rate Hike : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. దాదాపు మూడున్నరేళ్ల తరువాత (2023 ఫిబ్రవరి తరువాత) రెపో రేటును పెంచింది. 25 బేసిస్ పాయింట్లు నుంచి 5.50 శాతానికి చేర్చింది. బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటికే రుణాలు చెల్లిస్తున్న కోట్లాది మంది వినియోగదారులపై ఈఎంఐల రూపంలో భారం పడనుంది.
రెపోరేటు పెరిగిన వెంటనే ప్రతిఒక్కరి ఈఎంఐ అదేరోజు పెరుగుతుందని కాదు. రుణం ఏ బెంచ్‌మార్క్‌కు అనుసంధానమై ఉంది..? బ్యాంకు రీసెట్ తేదీ ఎప్పుడు? అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని వెంటనే పెంచకుండా లోన్ టెన్యూర్ ను పెంచవచ్చు. అంటే నెలవారీ ఈఎంఐ దాదాపు అదే స్థాయిలో ఉన్నప్పటికీ.. రుణం తీర్చే నెలలు పెరగొచ్చు. ఫలితంగా వడ్డీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. రూ.50లక్షల హోమ్ లోన్ ను 20ఏళ్లకు 7.15శాతం వడ్డీతో తీసుకున్నారని అనుకుంటే.. మొత్తం 25 బేసిస్ పాయింట్ల పెంపును బ్యాంకు కస్టమర్ కు బదిలీ చేస్తే వడ్డీ రేటు సుమారు 7.40కి చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు నెలవారి ఈఎంఐ సుమారు రూ.759 వరకు పెరగే చాన్స్ ఉంది. రూ. 1 కోటి రుణానికి నెలకు సుమారు రూ.1516 వరకు అదనపు ఈఎంఐ రావచ్చు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. బ్యాంకు, రుణం రకం, రుణం తీర్చేందుకు మిగిలిన కాల వ్యవధి ఇలా పలు అంశాలపై ఆధారణపడి ఉంటుంది.
రుణగ్రహీతలకు ఏం చేయాలి?
రెపో రేటు పెరిగిన నేపథ్యంలో ఫ్లోటింగ్ రేట్ లోన్ ఉన్నవారు తమ కొత్త వడ్డీ రేటు, ఐఎంఐ, రీసెట్ తేదీ, మిగిలిన టెన్యూర్ వివరాలను బ్యాంకు వద్ద చెక్ చేసుకోవాలి. అదనపు డబ్బు అందుబాటులో ఉంటే పార్ట్-ప్రీపేమెంట్ చేయడం ద్వారా భవిష్యత్ వడ్డీ భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
