New Digital Payment Rules : డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. ఇక OTP ఒక్కటే సరిపోదు.. 2FA మస్ట్.. ఫుల్ డిటెయిల్స్..!
New Digital Payment Rules : ఆన్ లైన్ యూపీఐ లేదా ఇతర పేమెంట్లకు ఇకపై ఓటీపీ మాత్రమే సరిపోదు. అదనంగా పిన్ కూడా కావాలి. లేదంటే ఫింగర్ ఫ్రింట్, ఫేస్ స్కాన్, ఐరిస్ స్కాన్ ఏది ఒకటి అదనంగా ఉండాలి. అప్పుడే పేమెంట్లు పూర్తి అవుతాయి.
- Sreehari A
- Published On : April 1, 2026 / 03:54 PM IST
New Digital Payment Rules ( Image Credit : AI )
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్బీఐ నిబంధనలు అమల్లోకి
- ఆన్ లైన్ పేమెంట్లకు ఓటీపీతో పాటు 2FA తప్పనిసరి
- ఇక హ్యాకర్లు OTPలతో హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యమే
New Digital Payment Rules : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్బీఐ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై కేవలం ఆన్ లైన్ పేమెంట్లకు ఓటీపీ ఒక్కటే సరిపోదు.. 2FA కూడా తప్పనిసరి.
డిజిటల్ పేమెంట్లను మరింత సురక్షితంగా చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు (ఏప్రిల్ 1, 2026) నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ను తప్పనిసరి చేసింది. నేటి నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల విధానం పూర్తిగా మారబోతోంది. ఇంతకుముందు కేవలం ఓటీపీ (వన్-టైమ్ పాస్‌వర్డ్)తో పూర్తి చేసే పేమెంట్లకు ఇప్పుడు మరింత సెక్యూరిటీని అందిస్తుంది.
ఆర్‌బీఐ కొత్త నిబంధనలు ఏంటి? :
అతిపెద్ద మార్పు ఏమిటంటే.. ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి కనీసం 2 ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ అవసరం. కేవలం టెక్స్ట్ మెసేజ్‌లో వచ్చిన OTPని ఎంటర్ చేస్తే ఇకపై పేమెంట్ పూర్తి చేయలేరు. ప్రతి పేమెంట్ కోసం మీరు ఈ కింది 3 పద్ధతులలో రెండింటిని వాడాల్సి ఉంటుంది.
- పిన్, పాస్‌వర్డ్, లేదా సీక్రెట్ పాస్‌ఫ్రేజ్.
- ఓటీపీ లేదా ఏదైనా హార్డ్‌వేర్ టోకెన్.
- ఫింగర్ ఫ్రింట్, ఫేస్ స్కాన్ లేదా ఐరిస్ స్కాన్.
ఈ కొత్త నిబంధనలు దేశీయ పేమెంట్లు కాకుండా విదేశీ పేమెంట్లకు కూడా వర్తిస్తాయి. అయితే, అంతర్జాతీయ కార్డ్ పేమెంట్లు పూర్తి అమలుకు అక్టోబర్ 2026 వరకు గడువు ఉంది. సైబర్ మోసాలను తగ్గించడం, డిజిటల్ పేమెంట్లపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే ఈ నిబంధనల ప్రాథమిక లక్ష్యంగా చెప్పవచ్చు.
OTP కాదు.. పిన్ కూడా తప్పనిసరి :
ఇటీవల ఫిషింగ్, స్పామ్, సిమ్ స్వాపింగ్ వంటి మోసాలు భారీగా పెరిగాయి. తద్వారా మోసగాళ్లు యూజర్ల OTP ఈజీగా దొంగిలిస్తున్నారు. సిమ్ క్లోనింగ్ ద్వారా హ్యాకర్లు మీ ఫోన్‌కు పంపిన OTPలతో యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు, బయోమెట్రిక్స్ లేదా డివైజ్ స్పెషల్ పిన్‌లతో పాటు ఓటీపీలు కూడా తప్పనిసరి. ఇక హ్యాకర్లు హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యమే.
మీ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?
ఈ రోజు నుంచి మీరు UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు లేదా వ్యాలెట్లతో చేసినప్పుడు ఈ మార్పులను గమనించవచ్చు. అదనపు సమయం : టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కారణంగా పేమెంట్ పూర్తి అయ్యేందుకు కొన్ని సెకన్లు ఎక్కువ సమయం పట్టవచ్చు.
స్మార్ట్ సెక్యూరిటీ :
ఇక ఐటీ శాఖ మీ ఆర్థిక ప్రవర్తనను గుర్తిస్తుంది. మీ సాధారణ డివైజ్‌తో చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేస్తుంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అయితే, కొత్త డివైజ్ లేదా పెద్ద లావాదేవీలు చేస్తే మాత్రం మరింత కఠినమైన నిఘా ఉంటుంది.
జవాబుదారీతనం :
బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ఇప్పుడు బాధ్యత పెరిగింది. సిస్టమ్ లోపం కారణంగా మోసం జరిగితే బ్యాంకు కస్టమర్‌కు నష్టపరిహారం చెల్లించవలసి రావచ్చు.
