Realme 14 Pro : అద్భుతమైన డిస్కౌంట్.. రియల్‌మి 14 ప్రో ధర ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

Realme 14 Pro : అమెజాన్‌‌లో అదిరిపోయే డిస్కౌంట్.. రియల్‌మి 14 ప్రో ధర భారీగా తగ్గింది. తక్కువ ధరలో ఈ ఫోన్ ఎలా కొనేసుకోవాలంటే?

Realme 14 Pro

Realme 14 Pro : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో రియల్‌మి 14ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. రూ.20వేల ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ దాదాపు రూ.20,500 ధరకు అందుబాటులో ఉంది.

Read Also : Realme GT 7 Pro : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. రియల్‌‌మి GT 7 ప్రోపై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

భారత్ మార్కెట్లో రూ.24,999 ధరకు రియల్‌మి 14 ప్రోలో క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా, భారీ బ్యాటరీ, ఇతర ఫీచర్లు ఉంటాయి.

ఈ రియల్‌మి ఫోన్ స్పెషల్ కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. అమెజాన్ రియల్‌మి 14 ప్రో ధర డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రియల్‌మి 14 ప్రో ధర ఎంతంటే? :
రియల్‌మి 14 ప్రో ధర అసలు ధర రూ.24,999 ఉండగా, అమెజాన్‌లో రూ.22,500కి తగ్గింది. HDFC, PNB, OneCard కార్డులతో కస్టమర్లు రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ రియల్‌మి ఫోన్ ధర రూ.20,500కి తగ్గుతుంది. అమెజాన్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.

ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ రెండూ నెలకు రూ.1,091 నుంచి ప్రారంభమవుతాయి. మీ పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్, బ్రాండ్, మోడల్ ఆధారంగా రూ.20,950 వాల్యూను పొందవచ్చు. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఈ డీల్ పొందొచ్చు.

రియల్‌మి 14 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 14 ప్రో మోడల్ 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G ద్వారా పవర్ పొందుతుంది. రియల్‌మి 14 ప్రో ఫోన్ 8GB వరకు ర్యామ్ (LPDDR4X), 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో మాక్స్.. ఇలా చేస్తే.. అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ రియల్‌మి ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.