iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో మాక్స్.. ఇలా చేస్తే.. అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!
iPhone 16 Pro Max : కొత్త ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్‌లో రూ. 15,500కే అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై విజయ్ సేల్స్ బిగ్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా రూ.15,500 కన్నా ఎక్కువ సేవింగ్ చేయొచ్చు.
విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా తక్కువ ధరకే పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఆఫర్లు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ (iPhone 16 Pro Max) రూ. 1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం, ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1,33,700కు లిస్ట్ అయింది.
ఈ ఐఫోన్ కొనుగోలుపై రూ. 11,200 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై అదనంగా రూ. 4,500 డిస్కౌంట్ పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్రో మాక్స్ (iPhone 16 Pro Max) 6.9-అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 2868 x 1320 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంది.
హుడ్ కింద ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ ఆపిల్ A18 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. 48MP మెయిన్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 4685mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.