Realme GT 7 Pro : అమెజాన్ బంపర్ ఆఫర్.. రియల్‌మి GT 7 ప్రోపై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Realme GT 7 Pro : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో రియల్‌మి GT 7 ప్రోపై ఒకేసారి రూ. 10వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

Realme GT 7 Pro
Realme GT 7 Pro : రియల్‌మి ఫోన్ ధర తగ్గిందోచ్.. రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T లాంచ్‌కు ముందే రియల్‌మి GT 7 ప్రో ధర భారీగా తగ్గింది. ఈ రియల్‌మి ఫోన్ రూ.59,999 ప్రారంభ ధరకు లాంచ్ కాగా, బ్యాంక్ డిస్కౌంట్‌తో సహా రూ.10వేల కన్నా ఎక్కువగా తగ్గింపు పొందింది.
గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారు సరసమైన ధరలో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 6,500 నిట్ పీక్ బ్రైట్‌నెస్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
రియల్‌మి GT 7 ప్రో డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో రియల్‌మి GT 7 ప్రో ఫోన్ రూ.54,998 ధరకు లిస్ట్ అయింది. రూ.5,001 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై అమెజాన్ రూ.52,248 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ ఫోన్ మోడల్, డివైజ్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
రియల్‌మి GT 7 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి జీటీ 7 ప్రో ఫోన్ 6.78-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్‌తో వస్తుంది. HDR 10+, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది.
6500 నిట్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. రియల్‌మి GT 7 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది.
Read Also : iPhone 16 Pro : ఐఫోన్ ఆఫర్ అదిరింది.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో.. అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!
50MP మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. రియల్‌మి GT 7 ప్రో 5800mAh బ్యాటరీతో పాటు 120W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది.