iPhone 16 Pro : ఐఫోన్ ఆఫర్ అదిరింది.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో.. అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!
iPhone 16 Pro : ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ప్రస్తుతం ఐఫోన్ 16ప్రో కేవలం రూ. 83,250కే లభ్యమవుతుంది.

iPhone 16 Pro
iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గింది. ఆపిల్ నుంచి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ ధర కన్నా చాలా తక్కువకే కొనుగోలు చేయొచ్చు.
ఈ ఐఫోన్ అసలు ధర రూ.1,19,900 ఉండగా, ఇప్పుడు రూ.90వేల కన్నా తక్కువ ధరకు లభ్యమవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో సరసమైన ధరకే పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో ధర తగ్గింపు :
ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) మొత్తం 4 స్టోరేజ్ (128GB, 256GB, 512GB, 1TB) వేరియంట్లలో వస్తుంది. రూ. 7వేల ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత 2 ఇ-కామర్స్ సైట్‌లలో రూ. 1,12,900కు జాబితా అయింది.
అదనంగా, ఐఫోన్ 16 కొనుగోలుపై రూ. 3వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఐఫోన్ 16 ధర రూ. 1,09,900కి తగ్గుతుంది.
పాత ఫోన్ ద్వారా ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. 5 ఏళ్ల ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. ఐఫోన్ 16 ప్రో రూ.86,250 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
రూ.3వేలు తగ్గింపుతో ధర రూ.83,250కి తగ్గవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ వాల్యూ ఉంటుందని గమనించాలి.
ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) అద్భుతమైన 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A18 ప్రో బయోనిక్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్-కెమెరా సెటప్, 48MP మెయిన్ కెమెరా, 48MP సెకండరీ కెమెరా, అదనంగా 12MP కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్, డైనమిక్ ఐలాండ్ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంది.