OnePlus 13s : పిచ్చెక్కించే ఫీచర్లతో వన్‌ప్లస్ 13s ఫోన్ వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్ ఇదే.. ధర ఎంత ఉంటుందో తెలుసా?

OnePlus 13s : వన్ ప్లస్ 13s ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. జూన్ 5 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చు. ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 13s : పిచ్చెక్కించే ఫీచర్లతో వన్‌ప్లస్ 13s ఫోన్ వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్ ఇదే.. ధర ఎంత ఉంటుందో తెలుసా?

OnePlus 13s

Updated On : May 22, 2025 / 6:34 PM IST

OnePlus 13s : కొత్త వన్ ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s లాంచ్ కానుంది.

ఆకట్టుకునే ఫీచర్లు, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్‌తో కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ (OnePlus 13s) జూన్ 5 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఈ వన్‌ప్లస్ ఫోన్ పవర్‌‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, అమోల్డ్ ప్యానెల్‌‌తో రానుంది.

Read Also : Vivo T4 Ultra : ఖతర్నాక్ ఫీచర్లతో వివో T4 అల్ట్రా ఫోన్ వస్తోంది.. అద్భుతమైన డిస్‌ప్లే, ధర ఎంత ఉండొచ్చంటే?

వన్‌ప్లస్ 13 ఫోన్ సర్కిల్ కెమెరా మాడ్యూల్, బ్యాక్ కెమెరా సెటప్‌కు డిజైన్ ఓవర్‌హాల్ ఉంటుంది. ఈ ఫోన్ వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. కానీ, వన్‌ప్లస్ 13 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి అంచనా వివరాలు ఇలా ఉన్నాయి.

వన్‌ప్లస్ 13s డిజైన్ :
వన్‌ప్లస్ 13s ఫోన్ బ్లాక్ వెల్వెట్, పింక్ శాటిన్, గ్రీన్ సిల్క్ అనే 3 కలర్ ఆప్షన్లలో ఉంటాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్లాష్ చదరపు మాడ్యూల్ ఉంటుంది. వన్‌ప్లస్ 13s ప్లస్ ఐకానిక్ అలర్ట్ స్లయిడర్‌ను అందిస్తుంది.

వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13s ఫోన్ 6.32-అంగుళాల 1.5k OLED ప్యానెల్‌తో రావచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ పవర్, 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజ్ వరకు ఉండొచ్చు.

ఆండ్రాయిడ్ 15-ఆధారిత కస్టమ్ UIతో రన్ అవుతుంది. 6,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావచ్చు. ఈ వన్‌ప్లస్ 13s ఫోన్ ఇప్పటివరకు బ్యాటరీ లైఫ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది.

కెమెరా విషయానికొస్తే.. వన్‌ప్లస్ 50MP సోనీ LYT700, 50MP శాంసంగ్ JN5 2x టెలిఫోటో బ్యాక్ కెమెరాతో రావచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాతో రావచ్చు.

Read Also : Vivo Smartphones : వివో క్రేజే వేరబ్బా.. రూ. 30వేల లోపు బెస్ట్ 5 కెమెరా వివో ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

వన్‌ప్లస్ 13s ధర (అంచనా) :
వన్‌ప్లస్ 13s, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R మధ్య ఉండొచ్చు. భారతీయ మార్కెట్లో ఈ వన్‌ప్లస్ 13s దాదాపు రూ. 45వేల ధర ఉండొచ్చు.