Vivo Smartphones : వివో క్రేజే వేరబ్బా.. రూ. 30వేల లోపు బెస్ట్ 5 కెమెరా వివో ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
Vivo Smartphones : వివో ఫోన్ కొంటున్నారా? రూ. 30వేల లోపు ధరలో అద్భుతమైన టాప్ 5 బెస్ట్ వివో కెమెరా ఫోన్లు ఉన్నాయి.. ఇప్పుడే కొనేసుకోండి.

Vivo Smartphones
Vivo Smartphones : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రీమియం ఫోన్ కావాలా? ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అద్భుతమైన వివో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Read Also : Vivo T4 Ultra : ఖతర్నాక్ ఫీచర్లతో వివో T4 అల్ట్రా ఫోన్ వస్తోంది.. అద్భుతమైన డిస్‌ప్లే, ధర ఎంత ఉండొచ్చంటే?
మిడ్-రేంజ్ ఫోన్‌లలో మంచి కెమెరాలు కలిగిన ఫోన్లలో ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. సెల్ఫీలు తీసుకోవచ్చు.. రీల్స్ కూడా అద్భుతంగా వస్తాయి.
ఈ వివో ఫోన్లు ఆకర్షణీయమైన డిజైన్, డ్యుయల్ 50MP లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. రూ. 30వేల లోపు ధరలో వివో బెస్ట్ 5 కెమెరా ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఏదైనా కొనేసుకోండి.
వివో T3 అల్ట్రా :
వివో T3 అల్ట్రా ఫోన్ OISతో 50MP డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. 50MP ఫ్రంట్ కెమెరాతో హై-రిజల్యూషన్ సెల్ఫీలను తీయొచ్చు.
Q9 మెటీరియల్‌తో హై-బ్రైట్‌నెస్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్ కోసం డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్ కలిగి ఉంది. మెమరీ కార్డ్ స్లాట్ లేదా హెడ్‌ఫోన్ జాక్ లేదు.
వివో V50e :
వివో V50e ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్, అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. కెమెరా OISతో కూడిన 50MP డ్యూయల్ లెన్స్, సోనీ IMX882తో 50MP ఫ్రంట్ సెన్సార్ కలిగి ఉంది.
వివో ఫోన్ 90Wతో ఫ్లాష్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 15తో పాటు రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వీడియో రికార్డింగ్ క్వాలిటీ 4Kతో పాటు డైమండ్ షీల్డ్ గ్లాస్, బిల్డ్ కూడా ఉంది.
వివో V30 :
వివో V30 డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరాలతో వస్తుంది. 4K వీడియో, హై లెవల్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 Gen3 చిప్, 80W ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. ఈ వివో ఫోన్ స్పీడ్, విజువల్స్ ఫొటోగ్రఫీతో వస్తుంది. వాటర్‌ప్రూఫింగ్ అవసరం లేదు. 120Hz స్మూత్ డిస్‌ప్లేతో వస్తుంది.
వివో V23 5G :
సెల్ఫీల కోసం 50MP + 8MP డ్యూయల్ ఫ్రంట్ కామ్ కలిగి ఉంది. OIS-సపోర్టింగ్ ట్రిపుల్ రియర్ కామ్, ఫ్లోరైట్ AG గ్లాస్ బ్యాక్ ప్రీమియం టచ్‌ను అందిస్తుంది. డైమెన్సిటీ 920 లైట్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అద్భుతమైన ఫొటోగ్రఫీకి బెస్ట్. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది.
వివో T4 :
వివో T4 ఫోన్ భారీ 7,300mAh బ్యాటరీతో వస్తుంది. 50MP + 2MP బ్యాక్ రియర్ కెమెరాలు అద్భుతంగా ఉన్నాయి. ఏఐ ఆధారిత IMX882 సెన్సార్ ఫొటో క్వాలిటీని అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen3 తగినంత స్పీడ్ అందిస్తుంది. 90W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ టైమ్ సేవ్ చేస్తుంది. కొంచెం బరువుగా ఉంటుంది.
ఏది కొంటే బెస్ట్? :
కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే.. వివో V30 ఫోన్ తీసుకోవచ్చు. పవర్ స్క్రీన్ బ్రైట్‌నెస్ కోసం వివో T3 అల్ట్రా కొనొచ్చు. అయితే వివో V50e, T4 ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. సెల్ఫీ ప్రియులు అయితే వివో V23 5G కొనుగోలు చేయొచ్చు.