Realme Watch S5 : బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్.. ఒక్క ఛార్జ్‌తో 20 రోజులు టెన్షన్ ఫ్రీ.. ఈ స్మార్ట్‌వాచ్ మిస్ అవ్వొద్దు!

Realme Watch S5 : కొత్త రియల్‌మి వాచ్ S5 వచ్చేసింది. 20 రోజుల బ్యాటరీ లైఫ్ అందించే ఈ వాచ్ అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme Watch S5

  • రియల్‌మి వాచ్ S5 1.43-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే
  • 110 స్పోర్ట్స్ మోడ్‌, బ్యాటరీ 20 రోజుల వరకు వస్తుంది
  • ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల నుంచి ఈజీగా కొనేసుకోవచ్చు

Realme Watch S5 : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? రియల్‌మి నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ రియల్‌మి వాచ్ S5 భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ వాచ్ S5లో 1500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిచే 1.43-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 110 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది.

ఈ వాచ్ S5 బ్యాటరీ 20 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. 5ATM వాటర్‌ప్రూఫ్ రేటింగ్ కూడా ఉంది. రియల్‌మి వాచ్ S5 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మి వాచ్ S5 ధర ఎంతంటే? :
రియల్‌మి వాచ్ S5 ధర రూ. 7,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌వాచ్ జూన్ 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ టైమ్ అమ్మకానికి వస్తుంది. ఈ వాచ్‌పై ఫ్లాట్ రూ. 500 తగ్గింపు లభిస్తుంది, దాంతో అసలు ధర నుంచి రూ.7,499 అవుతుంది. ఈ వాచ్ రాక్ గ్రే సాండ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ రిటైల్ స్టోర్‌ల నుంచి ఈజీగా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి వాచ్ S5 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రియల్‌మి వాచ్ S5లో 1500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 1.43-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. జీపీఎస్ 5జీ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లతో వస్తుంది. AODతో స్మార్ట్ నైట్ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ వాచ్‌లో 5GNSSతో కూడిన జీపీఎస్ ఫీచర్ కూడా ఉంది.

Read Also : Google Pixel 10 : సూపర్ డిస్కౌంట్ మావా.. గూగుల్ పిక్సెల్ 10పై ఏకంగా రూ. 15వేలు డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!

ఏఐ ఆధారిత హెల్త్ మానిటరింగ్, వన్-టచ్ ఏఐ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది. ఈ వాచ్ 11.8 మిమీ మందంతో, 32 గ్రాముల బరువుతో ఉంటుంది. 5ATM వాటర్‌ప్రూఫ్ రేటింగ్ ఉంది. 110 స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్టు ఇస్తుంది.

ఈ వాచ్ అనేది ఫిట్‌నెస్ ప్రియులు, మంచి లైఫ్ స్టయిల్ ఉన్నవారి కోసం స్పెషల్‌గా కంపెనీ తయారుచేసింది. ఈ వాచ్ ఫీచర్లలో హార్ట్ రేట్, SpO2, ప్రెజర్, స్లీప్ సౌండ్ ట్రాక్ చేయడం వంటి అడ్వాన్స్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ రియల్‌మి వాచ్ బ్లూటూత్ కాలింగ్, కస్టమైజడ్ వాచ్ ఫేస్‌లతో కూడా వస్తుంది. ఈ వాచ్ స్మార్ట్ ఫంక్షన్‌లను రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. వాచ్ S5 20 రోజుల వరకు ఛార్జ్ ఉంటుందని అంచనా.