చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. అక్టోబర్ 9న భారత మార్కెట్లలో Redmi 8 స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. డ్యుయల్ కెమెరా సెంట్రిక్ డివైజ్ తో పాటు 4,000mAh భారీ బ్యాటరీ కేపాసిటీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. షియోమీ ఇటీవల ఇండియాలో ఎంట్రీ లెవల్ రెడ్ మి8A సిరీస్ ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (2GB RAM + 32GB స్టోరేజీ)తో ధర రూ.6వేల 499గా కంపెనీ నిర్ణయించింది.
రెడ్ మి8 మోడల్ ఫోన్ డ్యుయల్ కెమెరా సెటప్ డిజైన్ గూగుల్ ప్లే కన్సోల్ పై రివీల్ అయింది. రెడ్ మి ఇండియా కంపెనీ చీప్ మను కుమార్ జైన్ Redmi 8 మోడల్ బ్యాక్ సైడ్ రివీల్ చేశారు. లీకైన స్పెషిఫికేషన్ల ప్రకారం.. బడ్జెట్ డివైజ్ లో 8 ARM కార్టెకస్ -A53 కోర్స్, స్నాప్ డ్రాగన్ 439 SoC ఉంది. అడ్రినో 505 GPU కూడా ఉంది. ఈ ఫోన్ 3GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. ఫోన్ డిస్ ప్లే HD+ (720×1520 ఫిక్సల్)తో పాటు 320ppi డెన్సిటీ ఉంది.
రెడ్ మి 8 మోడల్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఇంకా రివీల్ కాలేదు. కానీ, డాట్ నాచ్ డిస్ ప్లే ఉండే అవకాశం ఉంది. పాలీకార్బొనేట్ గ్లాస్, ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా బ్యాక్ సైడ్ ఉంది. దీనిపై ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్ రన్ అవుతుంది. షియోమీ కస్టమ్ MIUI10 స్కిన్ కూడా ఉంది. ఈ ఫోన్ యాష్, బ్లూ, గ్రీన్, రెడ్ మొత్తం నాలుగు కలర్లలో లభ్యం కానుంది. ఫోన్ ధర మార్కెట్లలో రూ.7వేలు నుంచి రూ.10వేల మధ్య ఉండనుంది. రెడ్ మి 8తో పాటు రెడ్ మి 8 Pro కూడా లాంచ్ కానుంది. 48 MP ప్రైమరీ కెమెరాతో వస్తోంది. దీనిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఈ ఫోన్ బెజిల్ లెస్ డిస్ ప్లే ఉంటుందని అంచనా.
స్పెషిఫికేషన్ల్లు – ఫీచర్లు ఇవే :
* డ్యుయల్ కెమెరా సెటప్
* 4,000mAh పెద్ద బ్యాటరీ
* 2GB RAM + 32GB స్టోరేజీ
* 8 ARM Cortex-A53 కోర్
* స్నాప్ డ్రాగన్ 439 SoC
* ఫోన్ డిస్ ప్లే HD+ (720×1520 ఫిక్సల్)
* అడ్రినో 505 GPU
* 320ppi డెన్సిటీ
* డాట్ నాచ్ డిస్ ప్లే
* పాలీకార్బొనేట్ గ్లాస్
* ఫింగర్ ఫ్రింట్ స్కానర్ (బ్యాక్)
* ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్
* షియోమీ కస్టమ్ MIUI10 స్కిన్
* 48 MP ప్రైమరీ కెమెరా ( Pro)
* బెజిల్ లెస్ డిస్ ప్లే
Mi fans! Just when you thought the #Diwali action has reached a peak, here’s #BatteryCameraAction!
Battery champion with 4⃣/_ _ arriving on 9th Oct.
It’s time to do moooooooore!
? Click more
? Watch more
? Play more
? Store moreRT if you know what’s coming. ?#Xiaomi ❤️ pic.twitter.com/71LxSA4iyk
— #MiFan Manu Kumar Jain (@manukumarjain) October 3, 2019