Samsung Galaxy A55 5G : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసినప్పటీ ఈ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఇప్పుడు రూ. 16వేల భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ఆకర్షణీయమైన ధరకు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఎంత తొందరగా కొనేసుకుంటే అంత బెటర్..
2/7
శాంసంగ్ గెలాక్సీ A55 5G అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A55 5G రూ.39,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.23,999కి లిస్ట్ అయింది.
3/7
ఈ-కామర్స్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై రూ.16వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.
4/7
శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
5/7
హుడ్ కింద గెలాక్సీ A55 5G ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో అమర్చి ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
6/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
7/7
ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కలిగి ఉంది.