Samsung Galaxy S24 FE
Samsung Galaxy S24 FE : మీరు శాంసంగ్ అభిమానులా? కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ (Samsung Galaxy S24 FE) ప్లాట్‌ఫామ్‌లో GOAT సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ సమయంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ శాంసంగ్ గెలాక్సీ S24 FEతో సహా హై-ఎండ్ ఫోన్ల ధరను భారీగా తగ్గించింది.
ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తుంటే ఈ స్మార్ట్‌ఫోన్ అసలు మిస్ చేసుకోవద్దు. ట్రిపుల్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఈ సేల్ సమయంలో ఈ శాంసంగ్ ఫోన్ రూ. 38వేల తగ్గింపుతో లభ్యమవుతుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే..?
శాంసంగ్ గెలాక్సీ S24 FE డిస్కౌంట్ :
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.59,999కు లభ్యమవుతుంది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది. ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ కేవలం రూ.35,999కే పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు శాంసంగ్ గెలాక్సీ S24 FE కొనుగోలుపై రూ.35,999 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ దాదాపు రూ.14వేలు ధర పలికితే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22వేల ధరకు సొంతం చేసుకోవచ్చు. కచ్చితమైన వాల్యూ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 FE స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ (Samsung Galaxy S24 FE) అల్యూమినియం ఫ్రేమ్‌తో గ్లాస్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 2400e చిప్‌సెట్‌తో 8GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP, 8MP, 12MP లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.