6 Best Smart Phones : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ. 20వేల లోపు ధరలో 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీదే ఛాయిస్..!

6 Best Smart Phones : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ. 20వేల లోపు ధరలో 6 టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్..

6 Best Smart Phones : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ. 20వేల లోపు ధరలో 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీదే ఛాయిస్..!

6 Best Smart Phones

Updated On : July 14, 2025 / 1:13 PM IST

6 Best Smart Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా సరసమైన ధరకే స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ (6 Best Smart Phones) కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్స్ మీకోసమే.. కెమెరాలు, లాంగ్ బ్యాటరీ లైఫ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది.

అతి తక్కువ ధరలో క్వాలిటీ కెమెరా ఫోన్ల కోసం చూసేవారికి బెస్ట్ ఫోన్లుగా చెప్పవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లలో రూ. 20వేల లోపు ధరలో 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

1. రెడ్‌మి నోట్ 14 :
రెడ్‌మి నోట్ 14 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7025-అల్ట్రా చిప్‌తో రన్ అవుతుంది. 50MP+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 20MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5110mAh బ్యాటరీతో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ సేల్ సందర్భంగా ఈ రెడ్‌మి ఫోన్ కేవలం రూ. 16,999కే అందుబాటులో ఉంది.

2. లావా అగ్ని 3 :
లావా అగ్ని 3 ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 66W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50MP+8MP+8MP కెమెరా కాన్ఫిగరేషన్‌తో పాటు 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Ultra : అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా భారీగా తగ్గిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

3. వివో Y39 :
వివో Y39 ఫోన్ 6.68-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. భారీ 6500mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సేల్‌లో రూ. 16,998కి అందుబాటులో ఉంది.

4. టెక్నో కామన్ 30 :
ఈ టెక్నో (Camon 30) ఫోన్ 6.78-అంగుళాల FHD+అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ మొబైల్ యూనిట్ మీడియాటెక్ డైమన్షిటీ 7020 5G చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 50 ప్రైమరీ కెమెరా, 50 ఫ్రంట్ కెమెరా, 70W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ రూ.19,999 ధరకు లభ్యమవుతుంది.

5. ఒప్పో A5 ప్రో :
ఒప్పో A5 ప్రోలో 6.67-అంగుళాల LCD ప్యానెల్ ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీ కలిగి ఉంది. డ్యూయల్ 50MP+2MP రియర్ లెన్స్, 8MP సెల్ఫీ కెమెరాను కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ సేల్‌లో రూ.17,998కి కొనేసుకోవచ్చు.

6. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ :
ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 80W స్పీడ్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ రూ.17,997 ధరకు లభ్యమవుతుంది.