Samsung Galaxy S24 Ultra : అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా భారీగా తగ్గిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Samsung Galaxy S24 Ultra : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ తక్కువ ధరకే వస్తోంది. ఈ డీల్‌ ఇలా పొందండి..

Samsung Galaxy S24 Ultra : అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా భారీగా తగ్గిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Samsung Galaxy S24 Ultra

Updated On : July 14, 2025 / 12:21 PM IST

Samsung Galaxy S24 Ultra : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 ఈరోజు (జూలై 14)తో ముగియనుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు అతి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ (Samsung Galaxy S24 Ultra) సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాను కొనుగోలు చేసేవారికి ఇదే బెస్ట్ ఆఫర్.. ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఈ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా డీల్ :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ అసలు ధర రూ.1,34,999 నుంచి 43శాతం డిస్కౌంట్‌తో రూ.76,999కి తగ్గింది. ఈ మోడల్‌లో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్ అనే రెండు వేర్వేరు కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : iPhone 16 Series : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఈ ఆఫర్ ఉండగానే కొనేసుకోండి..!

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ హైఆక్టేన్ పర్ఫార్మెన్స్, అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 7 మెయిన్ అప్‌గ్రేడ్‌లను పొందవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ 200MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 10MP టెలిఫోటో షూటర్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు డైనమిక్ LTPO అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ గెలాక్సీ AI ఫీచర్లను కూడా కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.