Samsung Galaxy S25 Ultra 5G
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. 2025లో అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెటర్ ఫోన్. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ (Samsung Galaxy S25 Ultra 5G) భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో రూ. 1,29,999 ధరకు లాంచ్ అయింది. అమెజాన్ ఆఫర్లు, ధర తగ్గింపుతో ఈ శాంసంగ్ ఫోన్ రూ. 29వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ శాంసంగ్ ఫోన్ అనేక ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్‌తో వస్తుంది. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్, సూపర్ బ్రైట్ డిస్‌ప్లే, S పెన్ సపోర్ట్, డిజైన్, సూపర్ స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ రూ.1,03,490 ధరకు అమ్ముడవుతోంది. లాంచ్ ధర కన్నా భారీగా తగ్గింది. కొనుగోలుదారులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి రూ.3,104 పొందవచ్చు. ధర రూ.1,02,000 కన్నా తగ్గింది. మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో రూ.1,250 వరకు తగ్గింపు పొందవచ్చు.
కొనుగోలుదారులు తమ పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్, బ్రాండ్, వేరియంట్ ఆధారంగా రూ. 48,500 వరకు పొందవచ్చు. అమెజాన్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. కస్టమర్లు మీ ఫోన్ మరింత సేఫ్ ఉండాలంటే ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. వన్ యూఐ 7తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 200MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో ఉన్నాయి. 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.