×
Ad

Samsung Galaxy Z Fold 6 : వారెవ్వా.. శాంసంగ్ క్రేజే వేరబ్బా.. అమెజాన్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60వేలు తగ్గింపు..

Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఈ మడతబెట్టే ఫోన్ ఏకంగా రూ. 60వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Fold 6 (Image Credit To Original Source)

  • అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6పై భారీ తగ్గింపు
  • 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,04,799
  • ఈ ఫోల్డబుల్ ఫోన్ ప్రారంభ ధర రూ.1,64,999
  • బ్యాంకు ఆఫర్లతో రూ. 1500 వరకు తగ్గింపు

Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. మీకు మడతబెట్టే ఫోన్ కావాలంటే ఇదే బెస్ట్ టైమ్.. చాలామందికి ఫోల్డబుల్ ఫోన్ కొనాలని ఉంటుంది. కానీ, ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా కాస్ట్ ఉంటుంది. మీకు బడ్జెట్ విషయంలో ఇబ్బంది లేకుంటే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 కొనేసుకోవచ్చు. ఏకంగా రూ. 60వేలు తగ్గింపుతో మీ ఇంటికి తెచ్చుకోవచ్చు.

అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ ఇప్పుడు గత వెర్షన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7తో పోటీగా నిలుస్తోంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతానికి, అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6పై భారీ తగ్గింపును అందిస్తోంది. మీకు ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 12GB ర్యామ్ వేరియంట్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ అసలు లాంచ్ ధర రూ.1,64,999 నుంచి అమెజాన్‌లో రూ.1,04,799కు లభ్యమవుతోంది. అలాగే, ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు తగ్గింపు పొందవచ్చు. సిల్వర్ షాడో కలర్ వేరియంట్ ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది.

Samsung Galaxy Z Fold 6 (Image Credit To Original Source)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 7.6-అంగుళాల ఫోల్డబుల్ డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X ఇన్నర్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

Read Also : Best 5G Phones : కొత్త ఫోన్ కావాలా? రూ. 20వేల లోపు ధరలో 5 బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు.. ఫుల్ డిటెయిల్స్

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కూడా ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్ ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 4MP కవర్ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. 4400mAh బ్యాటరీతో పాటు 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

మీరు కొనాలా? వద్దా? :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మార్కెట్లో అద్భుతమైన ఫోన్‌. భారీ ధర తగ్గింపుతో ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటే కొనేసుకోండి. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ నుంచి గెలాక్సీ ఏఐ ఫీచర్ల వరకు ఆకర్షణీయంగా ఉన్నాయి.